లేఖ

లేఖ

ప్రియమైన నా బుజ్జి బంగారానికి ప్రేమతో రాస్తున్న నా మొదటి ప్రేమ లేఖ…

ఏంటి నాకు ప్రేమ లేక రాసింది ఈ పిచ్చిది అనికుంటున్నావా…మరి ఏమ్ చేయను నాకు వున్నా మొదటి ప్రియురాలివి నువ్వే కదా…

నాకు ఆకలి అనగానే ఎంత పనిలో వున్నా పరిగెతుకుంటూ వచ్చి నీ చేతితో గోరుముద్దలు తినిపిస్తావు. నేను చాలు అన్నా వినకుండా నా పొట్ట చూసి ఏమ్ తిన్నావు చూడు. ఇంక నీ చిన్ని పొట్ట నిండనే లేదు అంటూ బ్రతిమిలాడి మరి తినిపించేస్తావు…

ఆడుకునేటప్పుడు నా అల్లరి చేష్టలకు నాకు దెబ్బలు తగిలితే నాకంటే ముందే ఆ దెబ్బలను చూసి నువ్వే అల్లాడిపోతావు…

సరదాకి పక్కన వుండే షాప్ వాళ్ళు నాకు తినడానికి షాప్ లో ఉన్నవి ఇచ్చేసి, ఆ షాపులో దాచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్లిపోయానా అంటూ కంగారుపడిపోయి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకొని ఊరంతా వెతికేస్తావు…

ఇంక వాళ్ళు నీ బాధ చూడలేక చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి నన్ను నీ దగ్గరకి చేర్చగానే నువ్వు పొందే ఆనందం వుందే…! అది అప్పుడు చుసిన చిన్న తనంలో నాకు తెలియదు. ఏమో కాని ఇప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నీ మాటల్లో, నీ కళ్ళలో ఆ ఆనందం కనిపిస్తూ ఉంటుంది…

నాన్న జోబీలో డబ్బులు కాజేసి కొనుకోడానికి షాపుకు వెళిపోతే ఆ షర్ట్ కింద వున్నా కుర్చీని చూసి ఈ పిల్ల మళ్ళీ ఏదో చేసింది అని గబగబా షాప్ దగ్గరకి వచ్చి నేను చేసిన తప్పుకి నన్ను ఏమైనా అన్నావేమో అనుకుంటే,

నన్ను ఒక్కమాట అయినా అనకుండా ‘ఏమయ్యా నీకు బుద్ధి ఉందా చిన్న పిల్ల తెలియక డబ్బులు తెచ్చి కొనుకుంటుందే అనుకో నువ్వు నచ్చ చెప్పి ఇంటికి పంపించాలి కదా. ఎంత తెస్తే అంత తీసేసుకుంటావా’ అని తిట్టిన తిట్లు తిట్టకుండా డబ్బులు లాకొని నన్ను ఇంటికి తీసుకొచ్చేసావు…

పాపం అప్పుడు ఆ షాప్ వాడి మొహం ఎలా ఉంటుందో ఉహించుకుంటేనే నాకు నవ్వు ఆగడం లేదు…

ఇంక పండగ వస్తే చాలు, నాకు గోరింటాకు పెట్టి నా చిట్టీ చేతులను చూస్తూ నువ్వు మురిసిపోయేదానివి…
అసలు నేనంటే ఎందుకమ్మా అంత ప్రేమ నీకు…

నిరంతరం నా కోసం ఆరాట పడిపోతు,నాకు ఏమేమి కొనలా… అందరిలోనూ నేను తల దించుకోకుండా ఉండాలను నీ శక్తికి మించి కష్టపడుతు ఆస్తి లేకపోయినా, నాన్న ఇంటికి ఏమి ఇవ్వకపోయినా నువ్వు బయట పనులు చేస్తూ నన్ను చదివించి ఏ లోటు లేకుండా పెళ్లి చేసి పంపించావు…

ఇప్పటికి నీ ఆరోగ్యం బాగోకపోయినా అవేమి లెక్క చేయకుండా నాకు బాలేదు అంటే నా దగ్గరకి పరిగెతుకుంటూ వచ్చేస్తావు…

అసలు నీ తల్లి ప్రేమకి హద్దులే లెవా అమ్మ…పెళ్లి అపోయింది కదా ఇంక మనకేంటి సంబంధ అనుకునే తల్లి అసలు నాకు ఎక్కడ కనిపించలేదు…కోడలు వద్దన్న వాళ్ళతో గొడవపడి మరి బిడ్డ క్షేమ సమాచారాలు కనుకుంటూనే వుంటారు…

తల్లి ప్రేమకి మించిన ప్రేమ మరి ఎక్కడ లేదు కదా… నవ మాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి మరణపు అంచులవరకు వెళ్లి నాతో పాటు మళ్ళీ పునర్జమ్మను ఎత్తి నాకు ఈ అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసి నీ గుండెల్లో పెట్టుకొని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చావు…

ఇన్ని చేసిన నీకు ఏమి ఇవ్వగలను అమ్మ…నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోగలనా…నిన్ను ప్రేమగా చూసుకోవడం తప్ప ఇంక ఏమ్ చేయగలను…మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పుడు నేనే నీకు అమ్మగా పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను…

నా ఈ ప్రేమ లేఖ నీకు కొత్తగా వున్నా నీకోసం రాసేసరికి నాకు మాత్రం బలే నచ్చేసింది. నీకు నా ప్రేమ లేక నచ్చేస్తుందని నాకు బాగా తెలుసు…

ఇదే నా తొలి ప్రేమ లేఖ నా ప్రియమైన అమ్మకు నా చిన్ననాటి జ్ఞాపకాలను అక్షర రూపంలో మలచి రాస్తున్న అక్షరలిపి లేఖ…

ఇట్లు
నీ ప్రియమైన నీ కూతురు…
నీ బంగారాన్ని… 🥰

నా చిన్న తనం జ్ఞాపకాలను ఒక లేఖగా రాసి మా అమ్మకి ఇవ్వాలి అనుకున్నాను కాని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అక్షరలిపి లో రాసిన ఈ లేఖను మా అమ్మకు చూపిస్తాను. అప్పుడు అమ్మ చాలా సంతోషిస్తుంది…

మన తొలి ప్రేమ,మొదటి ప్రేయసి మనకి అమ్మే కదా…
అందుకే నా తొలి ప్రేమ లేఖ అమ్మకే రాస్తున్నాను…

 

-పల్లా క్రాంతి కుమారి

 

0 Replies to “లేఖ”

  1. Super akka చాలా భాగుంది లేఖ చదివిన మీ అమ్మ గారు చాలా సంతోషిస్తారు and all the best akka ఈ లాంటివి ఇంకా ఏనో రాయాలి అని అనుకుంటున్నాను👏👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *