లాక్ డౌన్
చైనాలో కరోనా వచ్చిందని వార్తలు చెప్తున్నారు. కొద్దిగా హైదరాబాద్ వ్యాప్తిస్తుండగా”హైమా రెడీ అయ్యావా? మీ తమ్ముడు గృహప్రవేశం చేస్తున్నాడు కదా. ఏం గిఫ్ట్ తీసుకెళ్దాం?” అని అడిగాడు మహిందర్.
“నేను నిన్ననే గిఫ్ట్ కొనేశాను. మనం బయలుదేరడమే” అని చెప్పింది హైమావతి.మహిందర్ ,హేమావతి లు భార్య భర్తలు వాళ్లకి ముగ్గురు పిల్లలు. అమృత , లేఖ ,శివ లు.
ఇప్పుడు వీళ్ళందరూ కలిసి గృహప్రవేశానికి వెళ్తున్నారు.”ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండీ” అని హైమావతి అడిగింది.
“అవును… చాలా బాగా జరిగింది” అని చెప్పాడు మహిందర్.
రెండు రోజులు తర్వాత కరోనా మొత్తం వ్యాప్తించడం వల్ల చాలామంది చచ్చిపోతున్నారని లాక్ డౌన్ ప్రకటించారు. మహిందర్ ,హేమావతి లు కూలి పని చేస్తూ ఉండేవారు.
అమృత చెల్లి తమ్ముడిని బాగా చూసుకునేది. వాళ్ళని జాగ్రత్తగా స్కూల్ కి తీసుకొని వెళ్లి మళ్లీ సాయంత్రం జాగ్రత్తగా ఇంటికి తీసుకు వచ్చేది. దగ్గరుండి హోంవర్క్స్ చేయించేది.
ఈ కరోనా రాకముందు”ఎందుకు నాన్న ఒక ఆదివారం కూడా మీరు ఇంట్లో ఉండరు” అని అడిగింది అమృత.
“లేదమ్మా! పని చేయలి అని చెప్పి ఆదివారం ఒక్కరోజు హేమవతిని ఇంట్లో ఉండమని చెప్పి” తాను మాత్రం పనికి వెళ్ళిపోయేవాడు మహిందర్.మరుసటి రోజు స్కూల్ కి వెళ్తే తన క్లాసులో ఫ్రెండ్స్ అందరూ నిన్న ఆదివారం కదా. నువ్వు ఎక్కడికి వెళ్లావు ఏం సినిమా చూసావు అని అడుగుతూ ఉండేవాళ్లు.
తన అమృత మాత్రం ఏమి చెప్పేది కాదు.
తనకు తెలిసిన ప్రపంచం మాత్రం చెల్లి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం తర్వాత స్కూలు అంతే.తనక్కూడా తన తల్లిదండ్రులతో సమయం గడపాలి అని అనుకునేది కానీ ఒకరు ఉంటే మరొకరు ఉండేవారు కాదు.తనకి ఎప్పటినుంచో కోరిక ఒక రోజైనా వాళ్ల తల్లిదండ్రులతో గడపాలని అనుకుంది అమృత.
స్కూల్ చదువులు అయిపోయాయి. కాలేజీ చదువుతున్నారు అదే టైంలో కరోనా రావడం లాక్ డౌన్ పెట్టడం.మహిందర్ ,హేమావతి లు ఇంటికి దగ్గరలోనే పనిచేస్తున్న వాళ్లు కూడా ఈ కరోనా వల్ల పనిచేయదు అని చెప్పారు.
ఆ లాక్ డౌన్ ఉన్న రోజులు పిల్లలతో హ్యాపీగా గడిపారు. కానీ ఆ పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు కూడా. చిన్నప్పుడు తల్లిదండ్రులతో గడపాల్సిన పిల్లలు పెద్దయినప్పుడు తల్లిదండ్రులతో గడపడం ఎంతో విలువైన ఆనందం అనే చెప్పాలి అమృతకి.కానీ అమృత కోరిక మాత్రం నెరవేరింది.
తన తల్లిదండ్రులతో సమయం గడపాలనుకున్నది అదే ఈ లాక్ డౌన్ లో జరిగిపోయింది.అస్తవ్యస్తంగా ఉన్న కరోనా ఊర్లో మా అమ్మమ్మకి వచ్చింది అని తెలిసి మేము చాలా కంగారు పడ్డాము.
కానీ మేము వెళ్లలేకపోయిన రోజు ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళం. క్వారెంట్ లో కొన్ని రోజులు ఉండి ఇంటికి వెళ్లిపోయింది. ఈ కరోనా రావడం వల్ల కొందరు జీవితాల్లో మంచి జరిగింది కొందరు జీవితాల్లో కావలసిన వాళ్లు దూరం అయ్యారు.
ఆఖరి చూపు కూడా చూడలేకపోయారు. కొందరు ఆకలి వల్ల చనిపోయారు. మరికొందరు పని లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒకటి కాదు ఎన్నో సంఘటనలు జరిగాయి. మొట్టమొదటిసారి లాక్ డౌన్ పెడతారు అని అనుకోలేదు అది కరోనా వల్లే సాధ్యమైంది.
ఈ కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టినందుకు సంతోషించాలో, చనిపోయిన వారిని ఒక్కసారి కూడా చూడలేకపోయామని బాధపడాలో, అర్థం కావడం లేదు. కరోనాని పారిదోల్లడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు.
-మాధవి కాళ్ల