కూటికోసం_బాటసారి
కూటి కోసం నోటు కోసం
వలసలు పట్టణాలకు
పెద్దల విన్నపాలు వదలి
బతుకు కోసం సాగిన బాటసారి
అన్ని రోజులు మనవి కావు
కాలం ఒక తీరుగా సాగదు
దిక్కు తెలియక దీనస్థితికి చేరి
రహదారిపై నిలబడి పోతివి…
నడక సాగిస్తూ పరుగు పెడితివి
గమ్యము లేకుండా
సంచరిస్తూ సాహసం చేస్తూ
ఆకలితో అలమటిస్తూ
ప్రచండ భానుడు
నిప్పుల వర్షం కురిపిస్తే
మస్తిష్కం కాలిన
పాదాలు మండి
రోగం వస్తే
జ్వరం కాస్తే
అలసట వస్తే
ఆదుకునే ఆపద్బాంధవుడు ఎక్కడ…
గాలి చుట్టి మేఘం ఉరిమి
వాన కురిస్తే వరదలు వస్తే
చీకట్లు కమ్ముకు వస్తే
నష్టం కష్టాలు బాటసారి
నేత్రాలు ఎదురుచూసే ఇల్లు
అమ్మ కన్నీరు కారు స్తుందో..
ఎర్రని నిప్పుల కన్నుల్లో
ఒడిగట్టిన దీపపు కాంతి
నిప్పులు పోసిన ఒళ్ళు
కుచ్చుకున్న ముల్లులు
బాధలు ఎన్నో కుళ్ళిన
నల్లటి రాత్రి
హృదయం పై నృత్యం
అమ్మ పిలిస్తే కళ్ళముందు కనబడే
పిలుపు కోసము చెవులు
ఆత్రుతతో చూస్తుంటే
తలుచుకొని తెలుసుకొనే..
జీవితాన్నికి ఇదే ఆఖరు
చీకట్లో ఘూకరింపులు
వర్షము వెలిసే మెరుపు మెరిసే
పట్టిన మబ్బు వదిలే
ఆకాశంలో చుక్కలు వెక్కిరించే
శరీరంతో వాయువు ఆడుకుంటుంది
గ్రామములో అమ్మ
కడుపులో పేగు కాలింది..
-గురువర్ధన్ రెడ్డి