కుల వివక్ష
కులవివక్ష అనే విషయం చెప్తే చేంతాడంత వింటే
భారతం అంత అన్నట్టు
రావణకాష్టంలా కాల్తూవుంది.
సాధారణంగా ప్రజలు జీవనోపాధికి చేసే పనులను
ఆధారంగా కులం అనేది రూపొందింది . కాలక్రమేణ
అదిఒకసమాజాన్నివిచ్ఛిన్నం
చేసే ఆయుధంగా మారింది.
భారతీయ వ్యవస్థలోకులాల
మతాలప్రాధాన్యం ,ప్రభావం
ఎక్కువే అని చెప్ప వచ్చు .
ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు
ఎలా వుంటుందో అలాగే
ఏ వృత్తి లో నైనా రాణించి
జీవనోపాధి పొందవచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చట్టాలు, శిక్షలు
ప్రజాస్వామ్య విలువలు ఎన్నో
మార్పులు వచ్చినా కుల వ్యవస్థలో మాత్రం మార్పు
చోటుచేసుకున్నది తక్కువే.
అదీ కాకుండా వివక్షకు దారి తీసి” వేధింపులు, అఘాయిత్యాలు,అనుమానాలు ,శిక్షలు కనబడటం
బాధాకరమైన విషయం.
ఎంతో మంది సంఘ సంస్కర్తలు, మహనీయులు
కృషి చేశారు. జీవితాలను
ధారపోసి పోరాడారు.
కులవివక్షఎన్నోకష్టనష్టాలను
తెచ్చి పెడుతుంది. అయినా
సమానత్వంస్వేచ్ఛమూలాల్లో
పనిచేయడం లేదు.
నిరక్షాస్యత, పేదరికం, ప్రజల
అసహాయతలు, వివక్షకు
శక్తినిస్తున్నాయి.కులంఅనేది
సంక్షేమానికి తోడ్పడాలి. కానీ
అభివృద్ధికి ఆటంకంకావద్దు
కులవ్యవస్థ కొన్ని మూఢనమ్మకాలుదురాచారాల కు దారితీస్తుంది. వాటిని గోడలు గా నిర్మించి
పాలించి సామాన్య ప్రజల
పాలిట శాపంగా మారింది.
రాజ్యాంగంలో హక్కులు బాధ్యతలు పొందుపరిచినా
నామమాత్రంగానేసాగుతున్నవి .
ప్రతిభ ఆధారంగా కాకుండా
కుల మతాల ప్రాతిపదికగా
విద్య ఉద్యోగ వ్యవస్థలు జరుగుచున్నవి. దీని వలన
వివక్ష ఎక్కువ శాతం పెరుగుతుంది. ప్రజాస్వామ్య
విలువల కుప్రాధాన్యతలేదు
తరతరాలుగాపాతుకుపోయిన జాడ్యాన్ని అలాగే కొనసాగుతుంది.
అవగాహన పెంచుకొని ఆధునిక సమాజానికి అను గుణంగా పరిష్కారం ఆలోచించాలి పాలకులు, ప్రజలు.
ఆర్థిక అసమానతల వల్ల, యాంత్రిక జీవన వల్ల,
జీవితాన్ని ఈడుస్తూ వుంటే నవ భారత నిర్మాణం ఎప్పుడు అని ఎదురుచూడాలి.
కులవివక్ష ను వదిలి దేశభక్తి
అలవరచుకోవాలి. కొందరు
గొప్ప మనుషులు విదేశాలకు
కూడా కులం కార్డు ను మోసుకెళ్తున్నారు. విస్తరింప
చేస్తున్నరునాగరికసమాజంలో ఉన్నత చదువులు, ఉన్నతఉద్యోగాల్లోవున్నవారు సైతం కులవివక్ష కు
బాటలు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికిసమానత్వం వుండాలి ఆ రోజుల కోసం
వేచి చూడాల్సిందే……..?
– జి జయ