క్షణకాలం కర్తవ్యమని
ఆది విష్ణువు అవతారము నీవని…
కూలిన వనాలపై కురిపించిన నీప్రేమ
మనుషులా లోకానికి చిలికినా మకరందమై
చిగురించిన హృదయాలతో ఆంతరంగాలు
వికసించినా బంధాలై ప్రణమిల్లుతున్నాయి
ఆపాదాల చెంతన…
ఆకాశపు దీపాలు అవనికందని
అలంకరణలని నీ మోమున వెలుతురుల
హరివిల్లులను ఇంద్రధనుస్సుగా వంచి…
బాసచేసిన ప్రతిభలు ప్రజ్ఞాపాటవాలై
వదిలిన శరాలుగా ప్రకృతిలో పూచేతత్త్వంతో
ప్రతి ఆనందంలో పుట్టినది లోకమై
నడువాలని చొరవ చూపిన వెలుగుల
జ్ఞాన ప్రవాహంతో అజ్ఞానాందకారాన్ని
పారదోలెను…
మనస్సు నిలిపిన నీరూపం…ఎన్నో
సుగుణాలను రంగరించిన సౌగంధికాలకు
నిలయమని…తలచినా భావనలతో జారే
కన్నిటి వెనకాల నిలిచిన చిత్రం ఆనంద
భాష్పాలతో తడిసిన రూపమవుతు…
గుండెలను తెరచి గూడును కట్టి మనస్సు
బాసటను సంకీర్తనగా చేసి…పలికించిన
మహానుభావులకు ఆదర్శమై నిలిచావు…
కుదుట పడని కూర్పులతో….కొలతల
దేహం చివరకు ప్రయానమని కొలనున
నిలిచిన తామరలమై అంటని ఆప్యాయతతో అనురాగంగా పంచని మమతాను బంధాలను
వదిలిన మనుషులమై…అనాది ఆచారాల
భాంఢాగారము…కొలిచిన వాడికి కొండంత
చేరికతో…పిలిచిన వేదనకు సమయాన్ని
చూపక క్షణకాలపు కర్తవ్యమని ఆపదలో
ఆదుకొంటావు…
-దేరంగుల భైరవ