కృషి
మంచి భవిష్యత్తు కోసం మనమందరం ఎంతో ఎదురుచూస్తుంటాం.
మరి ఆ భవిష్యత్తు ఎప్పటికీ బాగుండాలంటే వర్తమానంలో
కృషి చేయాలి. గతంలో జరిగిన
సంఘటనల నుండి పాఠాలను
నేర్చుకోవాలి. మంచి ర్యాంక్
సాధించాలనుకునే విద్యార్ధి
వర్తమానంలో బాగా చదవాలి.
అలాగే ఉద్యోగ, వ్యాపారాల్లో
అభివృద్ధి చెందాలంటే కనుక
వర్తమానంలో కృషి చేయాలి.
ఇప్పుడు కృషి చేస్తే భవిష్యత్తు
బాగుంటుంది. ఇప్పుడు అశ్రద్ధ చేసి పనులు వాయిదా వేస్తే
మన భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. పిల్లల భవిష్యత్తు
కోసం తల్లిదండ్రులు ముందు
నుండి పొదుపు చేయాలి. అలా
చేయకపోతే పిల్లల భవిష్యత్తు
అగమ్యగోచరంగా తయారయి
వారు అనుకున్న పనులు ఏమీ
పూర్తి అవ్వవు. మన రాజకీయ నేతలు దేశ ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేస్తే దేశ భవిష్యత్తు
బాగుపడుతుంది. అందుకే మంచి ఆలోచనలు కల యువ
నేతలు రాజకీయ రంగలోకి
అడుగుపెట్టాలి. మరీ ముఖ్యంగా రచయితలు
రాజకీయ రంగంలోకి అడుగు
పెట్టాలి. రచయితలకు దేశ కాలమాన పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుంది. వారి
రాజకీయ ప్రవేశంతో సంపూర్ణ ప్రక్షాళన జరిగి దేశం అభివృద్ధి
చెందుతుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని