కొత్త శీర్షిక

కొత్త శీర్షిక

*కవి …ఓ కవీ..!!”అనే కొత్త శీర్షిక ప్రారంభానికి ” ముందు
మాట” ఇది..!!

*హవ్వ! కవికి ‘ ధిషణాహంకారమా’ ? ఎంత మాట..!
ఎంత మాట..!!

*కవిత్వంపై కంటే.. ప్రచారం,పురస్కారాలు, అవార్డుల
పైనే దృష్టి…!!

*ఈ తరం కవులకు.. నాలుగు ముక్కలు రాసి మీసాలు
మెలేసే తత్వం పెరిగిపోయింది.!!

*భాషా సంస్కారం సరే…సాహితీ సంస్కారం కూడా
కొరవడింది…!!

*అక్కసుతో కాదు…ఎందరినో చూశాక..చదివాక..
ఆవేదనతో చెబుతున్న మాట ఇది..!!

‘చిత్రం’గా వుంది. ఈ తరం కవుల ధోరణి. నాలుగు పుస్త
కాలు వచ్చాయో లేదో కళ్ళు నెత్తికెక్కుతున్నాయి.తాము రాసిందే కవిత్వం.తామే ‘కవుల’ మన్న అహంకారంబాగా
పెరిగిపోతోంది.ఒకాయన దీనికి ” ధిషణాహంకారం ” అని
పేరు పెట్టాడు.పైగా ఇది తన గురువులనుంచి నేర్చుకున్న
దని టిప్పణి కూడా ఇచ్చాడు.గురువులు అహంకారాన్ని
ఎప్పుడూ నేర్పరు. వినయం నేర్పుతారు.దానివల్లే విద్య శోభిస్తుంది.రాణిస్తుంది.నాకు తెలిసి ‘ధిషణాహంకారమని
‘చెప్పుకోగలిగిన కవి మనకు ఒక్కరే వున్నారు. ఆయనే
విశ్వనాథ సత్యనారాయణ గారు.ఈ పదం ఆయనకు
మాత్రమే నప్పుతుందన్నది నా వ్యక్తిగతాభిప్రాయం.!!

సరే…నేటి కవుల ధోరణి (అందరు కాదు..) కూడా మరీ విచిత్రంగా వుంటోంది.రాసేది తక్కువ. కూసేది ఎక్కువ‌.
ఒక కవితా సంపుటి వచ్చిందో లేదో…వెంటనే ఏదో ఒక
పురస్కార మో? అవార్డో రావాలి.దానికోసం మార్కెటింగ్
ప్రారంభమవుతుంది.మన పీఠాధిపతుల దగ్గరజేరి’ కాకా
లు’ పట్టి,’బాకాలు ‘ ఊది..మొత్తం మీద ఏదో ఒక సంస్థ నుంచి అవార్డులో,పురస్కార మో సంపాదించేస్తారు.‌ఇక అక్కడినుంచి ఈ కవిగారు ఆకాశంలోనే వుంటాడు.కాళ్ళు నేలను తాకవు. కళ్ళు పైకెళ్ళిపోతాయి.గగన కుసుమం
అయిపోతాడు.(పాపం)

కవిత్వం అనేది ఒక్కరోజులోనో,రెండ్రోజుల్లోనో అలవడే విద్యకాదు.నిరంతరం సాధన చేయాలి.కవిత్వం రక్తంలోకి
ఎక్కాలి.మరి నేటితరం కవులు నాలుగు ముక్కలు రాసి
మీసాలు మెలేసే తత్వం పెరిగిపోయింది.

కవిత్వం దైవప్రసాదం అంటారు కానీ..నా మటుకు నేను
అది అభ్యాసం,అథ్యయనం,సంస్కారం వలన అలవడే
ఓ విద్య అనుకుంటాను.ఇదంతా ఎందుకు చెబుతున్నా
నంటే…అ‌లు సిసలు కవిత్వం ఫలితాన్ని ఆశించదు..
దాని ప్రయోజనం లోకాన్ని ఆనందింపజేయడం.ఇలాంటి
కవిత్వం రాసిన మహానుభావులెందరో మన తెలుగు సాహితీ లోకంలో వున్నారు. నేటితరం కవులకు వారెవరో
పెద్దగా తెలీదు..ఒక వేళ వాళ్ళ పేరు తెలిసినా ,కవిత్వం
తెలిసుండదు..చదివి వుండరు….అదిగో అలాంటి వారి …
కోసమే ఈ కొత్త శీర్షిక…” కవి..ఓ కవీ “.

అహాన్ని , అహంకారాన్ని,ముఖ్యంగా ధిషణాహంకారాన్ని పక్కన బెట్టి ఈ శీర్షికలో ప్రస్తావించే కవుల కవిత్వాన్ని వారి రచనా‌ విధానం,ఆలోచనా ధోరణిని చదవండి. వారి పదప్రయోగాలనుగమనించండి..ఇదేదో కొలంబస్ లా నేను కొత్తగా కనిపెట్టిందేం కాదు..సిలబస్ రూపంలో ఆయా కవుల కవిత్వంలో ..వున్నదే..సాహిత్యం ఎవరి సొత్తూ కాదు..అభ్యాసంఅధ్యయనం,భాషా సంస్కారం
తో అలవడుతుంది..ఆతర్వాత అది మన సొంతమవు
తుంది. కవి భావప్రపంచంలో విస్తరించాలి.అయితే అతని
కాళ్ళెప్పుడూ నేలను తాకుతూ వుండాలి.అతడి అక్షరా
లకు మట్టి తడి తగలాలి.అతని రచనల్లో మనిషివాసన
గుప్పు మనాలి..అప్పుడే అది కవిత్వమవుతుంది. పది
కాలాలు పాఠకులను అలరిస్తుంది.అనందాన్ని పంచు
తుంది..అదే నిజమైన కవిత్వం..అతడే నిజమైన కవి.

థ్యాంక్యూ..!!

-గురువర్థన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *