కొత్త దారి
కోరుకుంటే కొత్త దారి
దొరుకుతుంది అన్నట్టు
రూపాయి కొత్త మార్పులు
సరళీకరణ మంత్రంతో
సామాన్య జనులకు
సమసి పోనీ కష్టం
సాధ్యం కానిది ఏదీ లేదని
సరికొత్తగా చూపిస్తుంది
రూపాయిమారిన వాడకం
మారుతున్న కాలంలో
సవాలు విసురుతోంది
డిజిటల్ యుగంలో
రూపాయి సంగతులు
నాణెం నాణ్యతమార్చుకొని
కరెన్సీ కొత్తదారి ప్రయాణం
సులువైన కొత్త పంథా
ప్రపంచానికి పరిచయమై
కనపడకుండా ప్రపంచాన్ని శాసిస్తుంది ఇప్పుడు
టెక్నాలజీ తెలియని వారికి సరికొత్త సమస్య ఇప్పుడు
టచ్ చేస్తే మారిపోతానంటోంది మరొకరి వద్దకు ఆగకుండా
బంగారి నాణాల నుండి
బరువు లేని కాగితాలై
దాచడానికి స్థలమే వద్దని
తెరచాటున మాయ చేస్తుంది అందరినీ
కంటికి కనపడకుండా
మనిషి దినచర్యలో భాగమై పోయింది
సరికొత్త రూపాయి
కొత్తదారుల కొత్తదనం
రూపాయి రూపం
మారిపోతోంది ఎప్పటికప్పుడు
ఆహా ఏమి ఈ డబ్బుల డాబుల సరికొత్త దారుల
సమ్మేళనం
పరమాత్మను తలవని వాడు కూడా పైసా పైసా అంటాడు మరి
అదే రూపాయి చేసే
గోల్మాల్ గోల కదా
బతకడానికి రూపాయి కావాలి కానీ రూపం ఏదైతే అంటోంది మరి…..?
– జి జయ