కోటీశ్వరుడు
అది హైద్రాబాద్ నగరం అక్కడ ఒక అందమైన అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ లో ఒక కుటుంబం ఒక భార్య ఒక భర్త
ఆ భార్యకి కొంచెం పిచ్చిది.
వాళ్ళకి పిల్లలు లేరు కానీ ఆస్తి మాత్రం బాగా ఉంది ఇంచుమించు 10కోట్ల ఆస్తి ఉంది వాళ్లకి ఒక పిల్లవాడిని తెచ్చుకుని పెంచుకున్నారు ఆ పిల్లవాడిని అనేక స్కూల్స్ లో జాయిన్ చేశారు కానీ అబ్బాయికి చదువు రాలేదు ఇలా తన దగ్గర ఉన్న డబ్బు అంత ఆ పిల్లవాడి కోసం కర్చుపెట్టి చాలా నష్టపోయాడు ఆ తండ్రి తన స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారంలో చాలా నష్టపోయాడు తన స్నేహితులే తనని మోసం చేశారు
ఇలా అన్ని రకాలుగా చితికిపోయిన ఆయన చివరికి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ అమ్మేసి ఆ డబ్బుతో వేరే చోటికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న డబ్బుతో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టారు అందులోనూ ఎదురు దెబ్బ తగలడంతో ఇంకా దీన స్థితికి దిగజారిపోయారు అప్పుడు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్నారు అలా సాఫీగా సాగిపోయే ఆయన జీవితం అర్ధాంతరంగా ఒక రోజు తన స్నేహితులు చిన్న పార్టీ కి పిలిస్తే వెళ్లి అక్కడ కబురులు చెప్పుకుంటూ కింద పడ్డారు అలా కింద పడిన వెంటనే ఆయన మరణించారు
అలా ఒక వెలుగు వెలిగిన మనిషి జీవితం అర్ధాంతరంగా ముగిసి పోయింది.
– భరద్వాజ్
ఒకోసారి ఓడలు బళ్ళు అవుతాయి. ఈ కధ నిజ జీవితంలో జరిగిన సంఘటన అనిపిస్తుంది.