కోపాన్ని తగ్గించాలి
సుమన్ జీవితం ఇబ్బందులపాలు అయ్యింది. అసలేమి జరిగిందిఅంటే సుమన్ బాగా చదువుకున్నాడు. చదువుతర్వాత మంచి ఉద్యోగంకూడా వచ్చింది. ఉద్యోగంవచ్చిన తర్వాత పెళ్ళి కూడాఅయ్యింది. సుమన్ కు ముక్కుమీద ఉంటుంది కోపం. కోపంచిన్నప్పటి నుండి ఉండేది.చిన్నప్పుడు తల్లిదండ్రులుఅతని కోపాన్ని భరించేవారు.ఒక్కగానొక్క కొడుకు ఏదో
ఆవేశంలో అంటున్నాడు అనిఊరుకునేవారు.
అతని కోపాన్ని స్నేహితులు కూడా తట్టుకోలేక అతనికి దూరంఅయ్యారు. అందరినీ కోపగించుకోవటం అతనికిఅలవాటుగా మారిపోయింది.భార్య శాంత చాలా సహనశీలి.భర్త ఆఫీసునుండి రాగానే అన్నీచక్కగా అమర్చి పెట్టేది. అతనుమాత్రం చిటపటలాడుతూనేఉండేవాడు. ఆఫీసులో పనిచేసేప్పుడు కలిగే ఆవేశాన్నిఇంటికి వచ్చాక భార్యపై తీర్చుకునేవాడు.
ఒకరోజుఆఫీసులో తన ఆఫీసరుచేతిలో చీవాట్లు తిని ఇంటికివచ్చాక భార్యపై తన ప్రతాపంచూపాడు. ఆమె భయపడింది.మరుసటి రోజుకి ఆమెకు జ్వరం వచ్చింది. తన బాధను
తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వచ్చిఆమెను పుట్టింటికి తీసుకునివెళ్ళారు. సుమన్ ఆఫీసునుండి ఇంటికి వస్తే భార్యఇంటిలో లేదు. అతనికిచాలా కోపం వచ్చింది. ఆమెకు ఫోను చేసాడు. మామగారుఫోన్ ఎత్తాడు.
అల్లుడిగారితో”చూడు బాబూ,నీ కోపాన్నినువ్వు తగ్గించుకోవాలి. ఊరికేనీ భార్యను కోప్పడితే బాగోదు.నీ భార్య సహనానికి కూడాహద్దులు ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి కోప్పడితే అర్ధం చేసుకోగలం. ఎప్పుడూకోప్పడితే ఎలా? నువ్వుమారతావని హామీ ఇస్తే అమ్మాయిని పంపుతాంలేకపోతే లేదు.”అన్నాడు.సుమన్ కు తన తప్పు
తెలిసింది.
చీటికీ- మాటికీచిరాకు పడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు. వెంటనేమామగారి ఇంటికి వెళ్ళి ఆయనకు సర్ది చెప్పి తనఇంటికి భార్యను తిరిగితీసుకుని వచ్చాడు. ఆతర్వాత అనవసరంగాఅతను ఏనాడూ భార్యనుకోప్పడలేదు. వారి జీవితంఆనందంగా గడవసాగింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని