కోపం
కావ్యకు కోపం ఎక్కువ దానికి తోడు మంచి జాబ్ ఉండడంతో సంపాదనా ఎక్కువే!తండ్రికేమెా కూతురికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేయాలనే ఆలోచన కానీ ఇంత కోపం ఉంటె అత్త గారింట్లో ఉండగలదా? అని ఒక సందేహం కూడా!
అందుకని కోపాన్ని తగ్గించు కోవాలి రా కావ్యా! తన కోపమె తన శతృవు రా! అని చెప్తూ వచ్చేవాడు..అయినా ఆమె మాత్రం అలాగే ఉండేది..సమాజంలో పెళ్లి చేయకపోతె బాగుండదని ఒక మంచిసంబంధం చూసి పెళ్లి చేసాడు..వాళ్లకు కావ్య గురించి అన్నీ అబద్దాలే చెప్పాడు ఎందుకంటె వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చేయాలన్నారు కదా పెద్దలు నేను ఈ కొన్ని ఆడితే తప్పు లేదనుకున్నాడు..
కావ్య కోపం గురించయితే అస్సలు చెప్పలేదు దాంతోవాళ్లు నమ్మేసి బోల్తా పడ్డారు ..కానీ కావ్య కాపురం మాత్రం మూన్నాళ్ల ముచ్చటే అయింది..వాళ్ల మీద కోపం చూపించి తన కాపురాన్ని విడగొట్టుకుంది..ఎంత మంది చెప్పినా ఏ మాత్రం ఆలోచించకుండా విడాకులు తీసుకుంది..
తండ్రికి వచ్చింది మళ్లీ కష్టం రెండో పెళ్లి చేయడానికిప్రయత్నం చేస్తున్నాడు..కోపం తగ్గించు కోమని చెప్పీ చెప్పీ అలసి పోతున్నాడుఈ సారయినా కాపురం చేస్తుందా? లేదా? అని రోజూదిగులు పడుతూనె ఉన్నాడు..
ఈ కాలం పిల్లలు వివాహ బంధాలకు విలువ ఇవ్వడమే లేదు..ఆడపిల్లలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో చట్టాలను తెస్తే అవి దుర్వినియెాగం చేస్తూ అహంకారం,పొగరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు..
కావ్య జీవితం మళ్లీ ఎలా ఉంటుందో? ఏమిటో?పొగరుకి అహంకారానికి కావ్య జీవితమే ఉదాహరణ.. ఆడపిల్లలూ దయచేసి అలా చేయకండి…
-ఉమాదేవి ఎర్రం