ఖీర్ తినాలని ఉంది కానీ

ఖీర్ తినాలని ఉంది కానీ..

 

రంజాన్ మాసం అంతా ఉదయం నుండి సాయంత్రం
వరకు ఉపవాసం ఉంటారు
ముస్లిం సోదర సోదరీమణులు.
నెల రోజుల ఉపవాసం చేసాడు
ఖాన్ సాహెబ్. ఆ ఉపవాసం చేయటాన్ని రోజా అంటారు.
ఖాన్ సాహెబ్ నెల రోజుల
ఉపవాసం తర్వాత ఈద్
రోజున తన మితృలకు
ఖీర్ తయారు చేయించాడు. చుట్టుపక్కల ఉన్నవారందరికీ
పంచాడు. వారందరూ ఎంతో
సంతోషంగా తిన్నారు. ఖాన్
సాహెబ్ ఇంటికి రాము వెళ్ళాడు. రామును సాదరంగా
ఆహ్వానించారు ఖాన్. కుటుంబ
సభ్యులను పరిచయం చేసిన
తర్వాత రాముకు ఖీర్ గిన్నెలో
పెట్టి ఇచ్చారు ఖాన్. రాము ఆ
ఖీర్ తినను అని చెప్పాడు. ఆ
మాట ఖాన్ సాహెబ్ కు నచ్చలేదు. ఎట్టిపరిస్థితుల్లో
తినాల్సిందే అని పట్టుబట్టాడు.
స్నేహితుడి బలవంతం మీద
ఖీర్ తిన్నాడు రాము. ఖీర్
తిని ఇంటికి వెళ్ళిన రాముకు
సుస్తీ చేసింది. ఆ విషయం ఖాన్ గారికి మరుసటి రోజు
తెలిసింది. పలకరించటానికి
వెళ్ళారు ఖాన్. అప్పుడు రాము కుటుంబ సభ్యులు
చెప్పిన మాట విని చాలా
బాధపడ్డాడు ఖాన్. అసలు
జరిగిన విషయం ఏమిటంటే
రాముకు డయాబెటిస్ ఉంది.
300 పైన షుగర్ లెవల్ ఉంది.
అయినా మితృడు బలవంతం
చేసాడని ఖీర్ తినేసాడు. ఇక
షుగర్ లెవల్ అమాంతం పెరిగి
హాస్పిటల్ పాలయ్యాడు ఖాన్
స్నేహితుడు రాము. షుగర్ ఉన్నా స్నేహితుడు బలవంతం
చేసాడని ఖీర్ తినేసాడు రాము. ఖాన్ చాలా బాధ
పడ్డాడు. తాను మితృడి ఆరోగ్య పరిస్థితి చూడకుండా
బలవంతంగా ఖీర్ తినమని
ఇవ్వటం వల్లే రాము ఆరోగ్యం
దెబ్బతింది అని గుర్తించి రాము
కుటుంబ సభ్యులను క్షమాపణ
కోరాడు. వారు “ఫర్వాలేదు, ఖాన్ గారూ. మీరు తెలిసి
చేసారా ఏంటి. ఏదో పొరపాటు
జరిగింది అంతే”అన్నారు. వారి
మంచి మనసుకు సలాం చేసి
తన ఇంటికి వెళ్ళారు ఖాన్.
ఖీరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొద్దిగా తినండి.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని.

0 Replies to “ఖీర్ తినాలని ఉంది కానీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *