కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ

కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ

రాకింగ్ స్టార్ యాష్ నటించిన కేజియఫ్ చాప్టర్ 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే ఆ సినిమా పైన మొదటినుంచీ ఎవరికీ ఎలాంటి హోప్స్ లేవు.

కాని ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యి ఒక మొమెంటం సాధించిన తర్వాత మాత్రం బాహుబలి సినిమా తర్వాత ఈ సినిమానే మేజర్ ఇండస్ట్రీ హిట్ అని అనిపించుకుంది.

నిజానికి ఇది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమా. కానీ సినీ ప్రేక్షకులు బాషతో మాకు పనిలేదు మంచి కథ ఉంటె చాలు అని నిరూపించడం జరిగింది.

అయితే ఆ సినిమా అయిపోయే సరికి పార్ట్ 2 కూడా ఉంది అని తెలియడం దాని గురించి అందరూ మాట్లాడుకోవడం తో చాప్టర్ 2 పైన హోప్స్ అందనంత ఎత్తుకు ఎదిగాయి.

దీనికి ముఖ్యమైనవి రెండే రెండు కారణాలు. ఒకటి హీరో ఎలివేషన్స్ అయితే, రెండు ఎమోషన్. ఎమోషన్ కి బాగా కనక్ట్ అయ్యి సినిమా సక్సెస్ అయ్యేలా చేసారు ఆడియన్స్.

మరి కేజియఫ్ చాప్టర్ 2 ఎలా ఉంది? ఎమోషన్, ఎలివేషన్ ని ప్రశాంత్ నీల్ బాగా మేనేజ్ చేశాడా? అసలు స్టొరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:- కేజియఫ్ చాప్టర్ 1 లో మనకి ఆనంద్ వాసిరాజు, రాకీ లైఫ్ ని చెప్పినట్టుగా చూపిస్తారు. ఇక ఈ సినిమాలో అతని కొడుకు అయిన విజయేంద్ర వాసిరాజు అంటే ప్రకాష్ రాజ్ మనకి స్టొరీ చెప్తూ ఉంటాడు.

నరాచి లో గరుడ ని చంపేసిన తర్వాత రాకీ లైఫ్ లో ఎం జరిగిందో మనకి చెప్తారు. అయితే ఈ సినిమాలో రాకీ ఇద్దరు శత్రువులతో పోరాటం చేస్తాడు. ఒకరు అధీరా అయితే ఒకరు ఇండియన్ గవర్నమెంట్ తో…

వీరిద్దరితో రాకీ పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ పోరాటం లో ఎవరు గెలిచారు? రాకీ తన అమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడా లేదా అన్నదే మిగితా కథ.

విశ్లేషణ:- కేజియఫ్ చాప్టర్ 1 తో పాలిస్తే కేజియఫ్ చాప్టర్ 2 లో హీరో ఎలివేషన్ సీన్స్ చాలానే ఉన్నాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా మనల్ని కట్టి పదేసేలా ఉన్నాయి.

కాని ఎమోషన్ కొంచం మిస్ ఫైర్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే కేజియఫ్ చాప్టర్ 1 లో రాకీ లైఫ్ తో పాటు మదర్ సెంటిమెంట్ ని కూడా బాగా మ్యానేజ్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

అయితే ఈ సినిమాలో అది కొంచం తగ్గింది అనే చెప్పాలి. ఎందుకంటే కేజియఫ్ పాటలల్లో ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది అయితే ఆ సాంగ్ తర్వాత హీరో, హీరొయిన్ డ్యూయెట్ రావడంతో మనకి ఇంటరెస్ట్ కొంచం తగ్గిపోతుంది.

ఇక పర్ఫార్మేంట్ విషయానికి వస్తే, కేజియఫ్ చాప్టర్ 1 తో పోలిస్తే 2 లో కొన్ని ఎక్కువ పాత్రలు యాడ్ అయ్యాయి అని చెప్పవచ్చు.

అయితే మొదటగా చెప్పినట్టు కేజియఫ్ చాప్టర్ 1 ఆనంద్ వాసిరాజు, రాకీ లైఫ్ ని చెప్పినట్టుగా చూపిస్తారు. ఈ సినిమాలో అతని కొడుకు విజయేంద్ర వాసిరాజు చెప్తూ ఉంటాడు.

ఇది మనకి కొంచం ఇంటరెస్టింగ్ గా అనిపించదు కాకపోతే కనక్టివిటీ బాగానే ఉంది. ఇక ఈ సినిమా బ్యాక్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే స్టొరీ విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. కాని ఆ పొరపాటు సినిమాపై ఇంటరెస్ట్ కోల్పోయేలా చెయ్యవచ్చు.

అదేంటంటే రాకీ వర్సెస్ అధీరా అండ్ రాకీ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ ఈ రెండు థీమ్స్ ని బాగా డీల్ చెయ్యలేక పోయారు. రాకీ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ ని బాగా చూపించారు కానీ రాకీ వర్సెస్ అధీరా అన్న అంశం ఏదైతే ఉందొ దాన్ని బాగా చూపిస్తే బాగుండు అనిపించింది.

అలాగే, స్క్రీన్ ప్లే కుడా కొంచం అక్కడక్కడా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇకపోతే శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా నటించి మెప్పించారు.

పాజిటివ్స్:-

హీరో యాక్టింగ్,

మ్యూజిక్,

హై ప్రొడక్షన్ వ్యాల్యూస్,

యాక్షన్ సీక్వెన్స్

 

నెగిటివ్స్:-

స్టొరీ,

స్క్రీన్ ప్లే లో కొంచం కన్ఫ్యూజన్,

అధీర ట్రాక్,

మదర్ సెంటిమెంట్,

రేటింగ్:- 2.5/5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *