కవులు
కవులు
కత్తులు పడుతున్నారు
బానిససంకెళ్ళను
తెగకొడుతున్నారు
క్రూరులను
తుదముట్టిస్తున్నారు
కవులు
కృష్ణశాస్త్రులవుతున్నారు
కల్పనలు
చేస్తున్నారు
క్షరరహితాలను
పేరుస్తున్నారు
కవులు
కాగడాలు పడుతున్నారు
మూఢనమ్మకాలను
తగలబెడుతున్నారు
మోసగాళ్ళను
బూడిదచేస్తున్నారు
కవులు
కలాలు పడుతున్నారు
కవితలు
కమ్మగా వ్రాస్తున్నారు
చదువరులను
సంతసపెడుతున్నారు
కవులు
కళ్ళు తెరుస్తున్నారు
అన్యాయాలను
ఎండగడుతున్నారు
నిజాలను
నిష్ఠూరంలేకుండా చూపుతున్నారు
కవులు
కష్టపడుతున్నారు
అందాలను
వర్ణిస్తున్నారు
ఆనందాలను
కలిగిస్తున్నారు
కవులకు
కరచాలనమిస్తా
వెన్ను
తడతా
ప్రోత్సాహము
ఇస్తా…✍️
-గురువర్ధన్ రెడ్డి
నిజంగా కవులు గొప్పవాళ్ళే.