కవిత్వం దాని వ్యక్తిత్వం
కవిత్వం ఓ అపురూప కళారూపం
అక్షరాలతో మేల్కొనును సమాజం
కవిత్వం ఓ మరుపురాని అనుబంధం
పదాల అల్లికలు వసుదైక కుటుంబాల మాలికలు
కవిత్వం ఓ ప్రేరణ
అలసి సొలసిన హృదయాలకు ఆదరణ
కవిత్వం ఓ కళాఖండం
అది అనిర్వచనీయమై భావాలకు నిలయం
కవిత్వం ఓ ఔషధం
హృదయాంతర మలినాలను శుద్ది చేస్తుంది
కవిత్వం ఓ హెచ్చరిక
కుళ్ళిపోయిన సమాజాన్ని ప్రశ్నిస్తుంది
కవిత్వం ఓ లాలన
కమ్మనైన భాషలో మురిపిస్తుంది
కవిత్వం ఓ జోల పాట
అద్భుతమైన అక్షరాల పూదోటలో నిద్రపుచ్చుతుంది
కవిత్వం ఓ కథనం
ఆలోచన సృజనాత్మకతలకు మూలం
కవిత్వం ఓ కమ్మని స్వరం
సుమధుర సుస్వరాక్షరాలు పాటలుగా
కవిత్వం ఓ వరం
యదలోని భావాలను స్వేచ్ఛగా ప్రకటిస్తుంది
కవిత్వం ఓ గమ్యం
గతించిన గమనాలను తీరం చేర్చును
కవిత్వం ఓ నూతన ప్రపంచం
ఉండవచ్చట ఏ తారతమ్యాలు
కవిత్వం ఓ ప్రశ్నల నిధి
ప్రజా నాయకుల అది బల్లెం పోటు
కవిత్వం ఓ అణుబాంబు
రగిలిన పీడిత ప్రజల ప్రతిరూపం..
కవి కి కాదేది అనర్హం..
కవి కి కలదు అన్నింటా ప్రవేశం..
అక్షర బాణాలను సంధించి.. మనసుల పై యుద్ధం చేసే వీరుడు కవి.. అట్టి నాతోటి వీరులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలతో
– కిరీటి పుత్ర రామకూరి