కవిత్వం అంటే తీరని దాహం
కవిత్వం అంటే తీరని దాహం
వచన తత్వంతో మెరిగే బంధం
మదిలో పుడుతుంది కవిత్వం
ఆలోచనల రవి కవిత్వం
సమస్యల శృంకలాలు తెగించినది కవిత్వం
కవిత్వం తలుచుకుంటే ఏదైనా సాధించగలదు
విప్లవతకు బావుట కవిత్వం
రణ సీమలకు నిలువుటద్దం కవిత్వం
కవి కళ్ళతో చూస్తాడు
మనసుతో రచియిస్తాడు
ప్రజల నాలుకల్లో వెలుగొందిన వాడు కవి
కవి అంటే చైతన్యానికి స్ఫూర్తి
రవి అంటే వెలిగే సామ్రాజ్యానికి కిరీటి
కవిత్వమైనది ఊహించిన ప్రతిభకు వైన్యం
దాస్య శృంకలాలను తెగించినది కవిత్వం
కత్తి కన్నా పదునైనది కవిత్వం
విప్లవతకు నిలువుటద్దం కవిత్వం
అజ్ఞాన చీకట్లను పారద్రోలేది కవిత్వం
విప్లవం వర్ధిల్లాలి
కార్మిక ఐక్యత వర్ధిల్లాలి
కవిత్వం కళాయుగం వర్ధిల్లాలి
-యడ్ల-శ్రీనివాసరావు