కవిత్వం
కవిత్వం ఒక గొప్ప ప్రక్రియ. దాని రహస్యం, కవిత్వంలోని మాధుర్యం కవితా ప్రియులకే తెలుసు.
‘కాళిదాసుకి తెలుసు, కవికి తెలుసు, కష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు, గుర్రం జాషువాకి తెలుసు అన్నారు ఓ ప్రముఖ కవి.
కత్తి కన్నా కలం గొప్పది. కవిత్వం రాయడం అంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యడమే.
కవిత్వానికి మరణం లేదు, అంటే రైతు పొలం పండించినంతకాలం కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు. కవిత్వం రాయాలనుకునే వారికి ముందుగా స్పందించే హృదయం ఉండాలి.
కవిత్వం రాయాలంటే తేలికైన వ్యవహారిక పదాలతో భావవ్యక్తీకరణ చెయ్యగలగాలి. చెప్పదలుచుకున్న భావం సుస్పష్టంగా, ముక్కుసూటిగా చెప్పగలగాలి. ఇంకా చక్కనైన తక్కువ పదాలతో కవిత్వం రాయగలగాలి.
అంటే మనం అనుకున్న భావాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పగలగాలి..
– గురువర్ధన్ రెడ్డి