కవితా దినోత్సవం
రవిగాంచని చోట కవిగాంచును
అన్నారు మహానుభావులు
అక్షరాలను అమర్చి
భావాలను మలచి
బంధాలను తరచి
సమాజాన్ని చూసి
నిజాలను కణిక చేసి
అనుభూతులను ఆహ్వానించి
ఆలోచనలను విస్తరించి
అంశాలను అర్థవంతం చేసి
సంస్కృతులను విస్తరించి
చరిత్రను ఇనుమడించి
కొత్త దనాలను ఆవిష్కరించి
మాధుర్యాలను రంగరించి
అభిరుచులకు అద్దం పట్టి
హృదయాలను ద్రవింప చేసి
అభ్యుదయాలకు ఆజ్యం పోసి
భాషనే సాధనం చేసి
భావాలను వ్యక్తీకరించి
ఊహలకు ఊపందించి
మానవీయతను మనముందుంచి
స్ఫూర్తినే సంధించి
పదాల పదనిసలు పలికించి
కవితా సౌరభాలు వెలిగించే
కవనసేద్యం చేసే వారందరూ
కదిలే కవితా మూర్తులే మరి
వారందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
– జి జయ