కావిడి బరువు
దేహానికి సందేహాలు
దేశానికేమో దిశానిర్దేశనాలు
మనకేమో ఆవేశాలు
రోకటిమోతలా రోషాలు
మనసంతా దోషాలు
తప్పించుకునే వేషాలు
ఎగదోసే నిషాలు
కరిగిపోతూ నిముషాలు
కరువైన కలతీరే సమయాలు
కదిలొచ్చే కలహాల ప్రతీకలు
దౌర్జన్యపు సమూహాలు
మూగమనసుల అరణ్య రోదనలు
నవ్వు మాస్కుల మనుషులు
పైకేమో మహర్షులు
లోనేమో చీకటి కుహరాలు
మోయలేని సందేహాల
నా కావిడి బరువు
దింపుతావా తథాగతా
-సి.యస్.రాంబాబు