కవి
కవి తక్కువే రాస్తాడు
ఎందుకు అంటే ఎక్కువగా గుర్తు ఉండి పోయేలాగ
అతనో చల్లని అగ్ని పర్వతం
ఓ వెచ్చని హిమ శిఖరం
అతను కొంచెం నెత్తుటితో, సగం కన్నిటి ధరాలతో రాస్తాడు
విమర్శలను మాత్రం గొడ్డలితో నరికి నట్టు రాస్తాడు
నిత్యం జీవితంలో లోతుపాతుల్ని అనుభవించిన మనిషి కాబట్టి
అతను మానవత్వం పరిమళించే మంచి మనసున్న మనిషి
అతని ఆలోచనలు ఎప్పుడు ఆకాశం వైపు నడుస్తుంటాయి
అతని కళ్ళు నిరంతరం జీవితాన్నే చదువుతుంటాయి…
కవిత దినోత్సవ శుభాకాంక్షలు💐💐
-శివరాం శంకర్ నాయుడు