కట్న కానుకలు
పెళ్లి చూపులైనాయి, ఒకరికొకరు నచ్చారు, కట్న కానుకల సంభాషణ మొదలైంది.
వరకట్నం?
అసలక్కరలేదు. చాలా సంతోషం.
కళ్యాణంమండపం?
సత్యసాయి మండపం బెటర్.
మంగళవాయిద్యాలు?
చెరిసగము.
ట్రావెల్స్ ఖర్చులు?
చెరిసగము.
ఫొటోగ్రఫీ ఖర్చు?
చెరిసగము.
బంగారము?
మీరెంత పెడితే మేమంత.
పట్టుచీరలు, సూట్లు?
మీరెంత మేమంత.
అత్తకు, ముత్త్తవ్వకు, ఆడపడచులకెంత?
జవాబు సంతృప్తిగా వుండాలి.
ఇల్లిస్తరా? భూమిస్తరా? ఏదైనా మీ బిడ్డకే.
క్యాటరింగ్ ఫలానా ఐతే బెటర్,
ఓకే.
మా అమ్మాయి జీతంలో సగం మాకు,
సగంమీకు.
కొద్దిమంది బంధువులతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేద్దాం, ఎందుకింత ఖర్చు, మిగిలిన డబ్బంతా వారి అకౌంట్లో వేద్దాం? పెద్దమనిషి సలహా, మేము ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తాం అందరం ఆలోచించుకొని అని వెళ్లి పోయారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తుండే!
ఒక్కసారి ఇరువైపులా మనస్పూర్తిగా ఆలోచిస్తే అందరికీ ఖర్చులు తగ్గుతాయి, నవ దంపతులకు పెద్దల దీవెనలందుతాయి, ఆడంబరాలకు పోకుంటే రెండు కుటుంబముల ఆర్థిక పరిస్థితి కుశలం, మార్పు ఎవరో తీసుకు రారు, మనమే ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మగపిల్లల పెండ్లి కావటం లేదను బెంగందుకు? ఆడ పిల్లల పెండ్లి కి ఆలస్యానికి కారణం ఇది కూడా, సముూల మార్పునాశిద్దాము మనఃపూర్వకముగా. భగవంతుని ఆశీస్సులు లభ్యం. వివాహవిధానమలందు మార్పును కోరుకుందాము
కృతజ్ఞతలు..
– గురువర్ధన్ రెడ్డి