కఠిన హృదయాలు
రోడ్డుపైన టూ వీలర్ పై వేగంగావెళ్తున్నాడు మహేష్. అతను అలా వేగంగా వెళ్ళటానికి కారణం ఉంది. వాళ్ళ అమ్మాయి ప్రతీక్షను పరీక్ష హాలు వద్ద దింపాలి. పరీక్షకు ఇంకా అరగంట మాత్రమే ఉంది. ఎంత వేగంగాసమయానికి ఆ పరీక్షహాలుకు చేరలేడు.
అయినాతన ప్రయత్నం తను చేస్తున్నాడు. అక్కడికీ వేగంగా వెళ్ళవద్దని ప్రతీక్షహెచ్చరించసాగింది. తండ్రిఆమె మాటలు వినలేదు.అలా వేగంగా వెళుతూఉండగా బండి స్కిడ్ అయిపోయింది. మహేష్
క్రింద పడిపోయాడు.
అతనితోపాటు అతని కూతురు ప్రతీక్ష కూడా క్రింద పడిపోయింది.అలా రోడ్డు పక్కన బండిపడిపోయినా, ఆ తండ్రీ కూతుళ్ళు క్రింద పడినాఆ రోడ్డుపై వెళ్ళే ఏ వాహనదారులూ ఆగలేదు.
వారికి సాయంగా రాలేదు.తండ్రి బాగా గాయపడ్డాడు.కూతురి కాలు విరిగింది. ఆమెలెగిచి నుంచోలేదు. తండ్రి సెల్ఆఫ్ అయిపోయింది. ఆమె సెల్తీసుకురాలేదు.
తండ్రి సృహతప్పిపోయాడు. ఆమె అరుపులు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆమెకుఈ సమాజంపై కోపం వచ్చింది.
ఇద్దరు మనుషులు రోడ్డుపైపడిపోతే పట్టించుకునేవారేలేరా అని బాధపడింది. ఆమెకష్టపడి లేచి రోడ్డుపైకి వచ్చిరోడ్డు మధ్యలో కూలబడిపోయింది. అప్పుడు అటుగావెళుతున్న కాలేజీ బస్సులోనివిద్యార్థులు ఆ తండ్రీ కూతుళ్ళను తమ బస్లోదగ్గర ఉన్న హాస్పిటల్ కుతీసుకుని వెళ్ళారు.
అలాగాయపడిన వారిద్దరినీ హాస్పిటల్లో చేర్చి వారికికావలసిన రక్తం కూడాడొనేట్ చేసారు ఆ విద్యార్థులు.
సమయానికి హస్పిటల్ కుతీసుకుని రావటం వలనవారిద్దరూ బ్రతికిపోయారు.
అప్పటివరకు కఠిన హృదయాలు ఉన్న మనుషులని అందర్నీ తిట్టుకున్న ప్రతీక్ష ఇప్పుడు ఈ యువతరాన్ని చూసి చాలా గర్వపడింది. నిజంగా యువతహృదయాలు చాలా సున్నితంగా ఉంటాయి.
వయసు పెరిగేకొద్దీ లోకంలో ఉన్న కుళ్ళుని చూసి వారి హృదయాలు బండబారి పోతాయేమో. ఎప్పటికీ
సున్నితమైన హృదయాలుకలిగి ఉండేలా యువతఉంటే ఎంత బావుణ్ణు అని ప్రతీక్ష మనసులో అనుకుంది.
ఆమె ఆలోచన నిజమైతేసమాజం బాగుపడుతుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని