కథలు రాయడం ఎలా
కథలు రాయడం ఎలా అనేది మన యూ ట్యూబ్ ఛానెల్ లో ఉన్నా మళ్లీ కొత్తగా చెప్తున్నా, నిన్న వీడియో కాల్ లో మాట్లాడింది కూడా ఇదే. కథలు ఎలా వస్తాయి? అసలు కథ అంటే ఏమిటి ? అదెక్కడ దొరుకుతుంది ? కంచి లోనా?కారం పూడి లోనా ఎక్కడ ఉంటుంది ? ఎలా ఉంటుంది ?ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. కవితలు రాసే వారు కథలు రాయలేరు అనేది ఎంతవరకు సబబు ? అనే ప్రశ్నలు చాలా వస్తాయి. కానీ కథలు రాయడం అనేది చాలా తేలిక అనేది ఎవరికీ తెలియదు.
ఎందుకంటే వారికి చెప్పేవారు ఎవరు ఉండరు. రాయాలనే తపన ఉంటుంది. కానీ ఏం రాయాలి అనేది తెలియదు, అందుకు ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు కథలు రాయాలి అంటే ముందుగా మీ రోజు వారి జీవితం లో ఏం జరుగుతుందో అది ఒక పేపర్ పైన రాయాలి. ముందు ఇలా రాశాక అప్పుడు కథ ఎలా వస్తుంది అనేది చెప్పుకుందాం
మొట్టమొదట,
ఫలితాన్ని ఆశించకుండా, మన కోసం మనం అనే భావన అలవర్చుకోవాలి..
మన భావాలు, మన ఆలోచనలు, నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు, మనకి మానసిక ఆనందం కలిగించినవి, బాధ కలిగించినవి, కోపం వచ్చినవి, ఏదైనా సరే..మన హృదయాన్ని తాకిన సంఘటనలు, పేపర్ మీద పెడుతూ ఉండటం.
ఆ సంఘటనలకు కాస్త కాల్పనికత, భావోద్వేగం జోడిస్తూ రాసేదే కథ.
రాసిన తరువాత, ఏ fb group లోనో, ఏ వాట్సాప్ grp లోనో పోస్ట్ చేశాక, అరే మన కథ ఎవరూ చదవలేదు..చూసి చూడనట్టు వెళ్ళారు..ఎలా ఉంది అని చెప్పలేదే…
వీళ్లు ఏంటి ఇన్ని తప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు?
ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ రచనలు చేసేవారు పెట్టుకోవద్దు.
మనల్ని మనం mould చేసుకోడానికి ప్రయత్నించాలి.. సద్విమర్శ నీ స్వీకరించాలి.
లోటుపాట్లు సరి చేసుకుంటూ, మెరుగులు దిధ్దుకుంటూ ముందుకు సాగాలి.
రచన చేయగలగడం ఒక సృజాత్మక కళ. దానికి కోచింగ్ క్లాసులు ఉండవు. ఇంత టైం లో ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉండవు
నిత్య విద్యార్థిగా ఉంటూ, పరిశీలనా శక్తి పెంచుకుంటూ, మన ఆలోచనలు సానపెట్టుకుంటూ ముందుకు సాగాలి.
Above all,
రాయాలి అంటే ముందు చదవాలి..రోజుకి..కనీసం వారానికి ఒక మంచి పుస్తకం చదవాలి.
-అక్షరలిపి టీం