కథలు ఎలా రాయాలి?
కథలు చాలా మంది చాలా రకాలుగా రాస్తారు. కొందరు జరిగిపోయిన దాన్ని చెప్తూ ఉంటారు కానీ కొందరు జరుగుతున్నట్లుగా రాస్తుంటారు. ఇంకొందరు తాము అనుభవించిన జీవిత పాఠాలను చెప్తూ ఉంటారు. ఇక ఇందులో ముఖ్యమైనది. సాహిత్య విలువలు ఉన్న కథ.
ఈ సాహిత్య విలువలు ఉన్న కథ వేరుగా రాయాలి సినిమా కథలు స్క్రిప్ట్ వేరు గా రాయాలి ముందుగా ఎలాంటి కథలు రాయాలి అనుకుంటున్నారో గమనించుకోవాలి. సినిమా కథలను పక్కన పెడితే సాహిత్య విలువలు ఉన్న కథల్లో వస్తువు ఎలా ఎంచుకోవాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం…
సాహిత్య వస్తువు శరీరం అయితే అసలు వస్తువు అంటే ఏమిటి అంటే కథ యొక్క అంశం అంటే కథను నడిపే విధానం అంటే పాత్రల చుట్టూ కథను అల్లడం, కథలో పాత్రలు ఇమిడి ఉండటం.
కథను ఎలా మొదలు పెట్టాలో తెలిసి ఉండాలి. కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే విధంగా డివైడ్ చేసుకోవాలి. అయితే ఇది కేవలం సినిమాకి సంభందించి మాత్రమే అనుకుంటారు.
అది తప్పు ఆ బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేది ప్రతీ కథలోనూ ఉంటాయి ఉండాలి కూడా… ఉదాహరణ కు, ఒక ప్రేమ కథ రాస్తున్నప్పుడు కథా నాయకుడు, కథా నాయిక పరిచయం వారి పని మొదలు పెడుతూ, వాళ్ళు ప్రేమలో పడడానికి కావాల్సిన పరిస్థితులు సృష్టించి, మిడిల్ లో వారి ప్రేమకు లేదా పెళ్లికి గల అడ్డంకులు చూపిస్తూ చివరికి పరిష్కార మార్గం తో కథను శుభం వరకు తీసుకు రావడం.
అయితే శుభం వరకు రావాల్సిన పరిస్థితులు, సమస్య పరిష్కారాలు ఎంతో ఆలోచించి రాయాలి. ఒకరు అయిపోయింది అని రాస్తారు. ఒకరేమో ప్రస్తుతం జరుగుతుంది అన్నట్టు రాస్తారు. ఇంకొకరు జరగబోతోంది అన్నట్టు గా రాస్తారు. ఏది ఎలా రాసినా అందులో జీవం ఉందా లేదా అన్నది ముఖ్యం.
సాహిత్య విలువలున్న కథ అంటే సజీవ సాక్ష్యం గా కొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చూపుతూ సాహిత్యాన్ని ఏ మాత్రం తగ్గించకుండా వాటిని కించ పరచకుండా రాయడం . రేపు ఎలాంటి కథలు సాహిత్య విలువలు కలిగి ఉంటాయో తెలుసుకుందాం. ఈ వ్యాసం పై మీ అభిప్రాయం తెలుపండి🙏 ధన్యవాదాలు
నాసర్ గారు. రచనల్లో విధాలు రకాలు అడిగారు చాలా ఉంటాయి , విషాదం, శాంతం,ప్రేమ, విచారం, సంతోషం, దుఖం , ఖేదం ఇలా రకరకాల రచనలు ఉంటాయి . కానీ కథల్లో వీటితో పాటు సామాజిక, సమాజం కోసం రాసేవి ఉంటాయి. ఎలాంటి రచన అయినా మనసును తట్టి లేపాలి, ప్రశ్నించాలి, ఎదిరించలి, ఆలోచించేలా చేయగలగాలి ఇవన్నీ రచనలు రచయిత అనుభవిస్తూ మనసుతో రాయాలి.
ఎవరో రాసినవి కాకుండా మీ మనసుకు తోచినవి, మీరు స్పందించినా ,చూసిన వాటిని మీ ఊహా జోడించి రాయాల్సి ఉంటుంది . ఇక పోతే ఇక్కడ రోజు వారి అంశాలు ఇస్తము వాటిల్లో మీకు వచ్చిన కవిత , కథ , నవల, వ్యాసం ఇలా ఏదైనా రాయవచ్చు .
ఈ సినిమాకు, కథకు చాలా తేడా ఉంటుంది. ఇదెలా అంటే సినిమా అనేది విజువల్ గా కనిపిస్తే , కథ అనేది రాయడం అంటే ఉహలో ఉంటుంది. ఉహ లో మనం ఎంతో ఉహించుకోవచ్చు, కానీ అదే దృశ్య రూపం లోకి వచ్చే సరికి చాలా తేడా ఉంటుంది కథ గా రాసింది సినిమాగా తీస్తే ఒక్కొక్క సారి దాని అసలు రూపం మారవచ్చు, లేదా ఇంకా బాగా రావచ్చు, అందుకే హాలివుడ్ లో మొత్తం కథ అంతా పేపర్స్ పైనే పెడతారు అక్కడే 99 శాతం అయ్యాక ఒక్క శాతం మాత్రం విజువల్ గా తీయడం జరుగుతుంది, మరి మనం కథల గురించి కాకుండా సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవడం అంటారా అక్కడికే వస్తున్నా మనం రాసే ప్రతి కథను సినిమా గా ఉహించుకుంటూ రాయాలి. అదే సమయం లో సాహిత్యాన్ని కూడా ఉండేలా చూడాలి.
సాహిత్యం అంటే వర్ణన , చంధస్సు, ఉపనిషత్తులు ఇవన్ని కలగలిసి ఉండాలి, ఇవ్వన్ని ఎంతంటి మాకు తెలియదు అంటారా నిజమే కొన్ని మాత్రమే పెద్దలు పూర్వకాలం లో రాసారు ఇప్పుడు ఇవ్వన్ని రాసినా ఎవరు పట్టించుకోరు. కథను చెడిపోకుండా రాయడమే గొప్ప. మొత్తానికి కథను ఒక మొదలు, ఒక మధ్యస్థం, ఒక చివర ఉండేలా చూసుకుని రాయాలి. సగం నుండి రాయడం వల్ల కథ ఎవరికి అర్ధం కాదు, అంటే అతనొచ్చి అక్కడ ఉన్నాడు ఆమె నవ్వింది అంటే అసలు అతను ఎవరు అక్కడికి ఎందుకు వచ్చాడు రాక కు కారణం ఏమిటి ఆమె ఎవరు ఎందుకు నవ్వింది అనేవి వివరంగా వర్ణన జోడించి రాయాలి. ఇది కథ రాసే పద్ధతి. మరొక రోజు మంచి అంశం తో మళ్ళి మాట్లాడుకుందాం. నమస్తే ధన్యవాదాలు. 🙏
పైన చెప్పినట్టు సాహిత్య విలువలు కల కథలు ఈ సాహిత్య విలువలు ఉన్న కథ వేరుగా రాయాలి సినిమా కథలు స్క్రిప్ట్ వేరు గా రాయాలి ముందుగా ఎలాంటి కథలు రాయాలి అనుకుంటున్నారో గమనించుకోవాలి సినిమా కథలను పక్కన పెడితే సాహిత్య విలువలు ఉన్న కథల్లో వస్తువు ఎలా ఎంచుకోవాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం సాహిత్య వస్తువు శరీరం అయితే అసలు వస్తువు అంటే ఏమిటి అంటే కథ యొక్క అంశం అంటే కథను నడిపే విధానం అంటే మూడు రకాలుగా విభజించి ఉంటే ఒకటి రెండు పాత్రల చుట్టూ కథను అల్లడం 3 కథలో పాత్రలు ఇమిడి ఉండటం.
వస్తూ వాస్తవిక మైతే పాత్ర చుట్టూ కథను అల్లడానికి అవకాశం ఉండదు అదే వస్తువు కల్పిత పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది ఉదాహరణకు సినిమా కథ లో సినిమా హీరో చుట్టూనే తిరుగుతుంది. అయితే సాహిత్య విలువలు ఉన్న కథల్లో అలా ఉండదు వస్తువులు పాత్రలో ఇమిడిపోయి ఉంటాయి వేరు చేయడానికి కుదరదు సాహిత్య విలువలు ఉన్న కథలు అన్ని పాత్రలు ముఖ్యమైనవి ఉండాలి రచయిత తన అవసరానికి వాడుకున్నట్టు ఉండకూడదు ఆ పాత్ర లేకపోతే కథ లేదు అన్నట్టు గా ఉండాలి . ఇలాంటి కథలే పాఠకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
అక్షరలిపి టీం