కథా సమీక్ష
ఒక పిల్లవాడు తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యం. జాలయ్య ఇంటి పరిస్థితులను బట్టి కొడుకు అడుగుతుంటే వాయిదా వేస్తూ వచ్చాడు.
తల్లి అనారోగ్యంతో చనిపోయింది తండ్రి రిటైర్డ్ అయి కొడుకుతో ఉంటున్నాడు. ఇక్కడికే తన జీవితం సగంకుపైగా గడిచిపోయింది.
ఇంకా ఎక్కడ హీరో అవకాశాలు వస్తాయి ఏజ్ దాటిపోయింది క్యారెక్టర్ ఆర్టిస్టు గా అత్యధిక ప్రయత్నం చేస్తే గాని రావచ్చు.
ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి ఇకపై అదృష్టం తాను అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా,
తల్లిదండ్రుల సేవ చేస్తూ వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ తోడబుట్టిన వారిని బాధ్యతగా నిలబెట్టి జీవితంలో కొడుకుగా నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉన్నాడు హరి ఇంతకు మించిన భాగ్యమేముంది.
హరి కి అభివందనములు
సమిక్షకురాలు: భేతి మాధవి లత