కష్టపడి పనిచేస్తేనే సుఖముందోయ్
రోజులో వెలుగు నీడలు ఉన్నట్లేజీవితంలో కష్ట సుఖాలనేవి ఉంటాయి. చిన్నతనంలో అనేక కష్టాలు పడి ఏదో సాధించాలనే కసితో తీవ్రమైన కృషిచేసి ఆ తర్వాత సుఖమయ జీవితంగడిపినవారెందరో.
రామోజీఫిల్మ్ సిటీ నిర్మించిన శ్రీ రామోజీ రావు గారు మొదట్లో చాలా చిన్న స్ధాయిలో వ్యాపారంమొదలుపెట్టారు. ఆ తర్వాతకష్టపడి పనిచేసి న్యూస్ పేపర్లు,టెలివిజన్ ఛానెల్స్,స్ధాపించి ఇప్పుడు వ్యాపారసామాజ్రాన్ని స్ధాపించి విశేషకీర్తి ప్రతిష్టలతో పాటు గొప్ప సంపద కూడా పొందారు.
అలాగే శ్రీ మల్లారెడ్డి గారుమొదట్లో పాల వ్యాపారం చేసి,పూల వ్యాపారం చేసి కష్టపడిపనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అనేక విద్యా సంస్ధలను స్ధాపించి ఆ తర్వాత ఎమ్మెల్యే,ఎం.పీ పదవులు పొంది నేడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు.
అలాగే శ్రీ పుల్లారెడ్డి గారు చిన్నవ్యాపారం మొదలుపెట్టి విశేషకృషి చేసి పుల్లారెడ్డి స్వీట్స్అనే బ్రాండును ఏర్పరచిగొప్ప కీర్తి ప్రతిష్టలు పొందారు.ఆయన షాప్స్ దేశవిదేశాల్లో ఉన్నాయి.
పుల్లారెడ్డి స్వీట్సుఅంటే దేశవిదేశాల్లో గొప్ప పేరుపొందిన స్వీట్స్ అనే గుర్తింపువచ్చింది. ఆయన అనేకమంది యువకులకు విద్య,ఉపాధి కల్పించారు. ఆయన జీవితంఎందరికో ఆదర్శంగా మారింది.
అలాగే ఎక్కడో పెట్రోల్ బంకులోపనిచేసిన శ్రీ అంబానీ తర్వాత కాలంలో చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆ తర్వాత గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్నిస్ధాపించారు. ఆయన పిల్లలుఇప్పుడు ఆ వ్యాపారాలను విజయవంతంగా నడుపుతూఉన్నారు. ఏదిఏమైనా కష్టపడిపనిచేస్తేనే సుఖాలను పొందవచ్చు.
-వెంకట భానుప్రసాద్ చలసాని