కష్టాల కడలి
జీవితంలో కష్టాలేన్నో
అష్ట కష్టాలేనే కాదు
కష్టాల కడలిలో
ఈది తే గాని
మనిషి రాటుతేలడు
కష్టాలు కావవి
జీవిత పాఠాలు
వ్యక్తిత్వం సరి దిద్దే సోపానాలు
కష్టాలకి ఓర్పు నేర్పు
తోడుంటే విజయం నీ వెంటే
కష్టాలు ఊరికే రావు
ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి
కష్టాల కడలి ఒడ్డున
ఇసకలో కట్టకు
ఆశల సౌధం
కడలి అలలు తాకుతాయని
అరచేయి అడ్డు పెట్టకు
సీత కష్టాలు సీతవి
పీత కష్టాలు పీతవి
ఎవరి కష్టాలు వారివి
పెద్దో చిన్నో కష్టాలు అందరికీ
కష్టాలు లేనిదేవరికీ
లేక పోతే దైవం లేడు
మనమే దైవం
ఎవరి కష్టాలు
వారికి పెద్దవనే బాధ
మనమూ అవునంటే
మానసిక స్వాంతన
–మోటూరి శాంతకుమారి