కష్ట సుఖాలు

 కష్టసుఖాలు

ఏమండీ ఇది విన్నారా అంటూ పొద్దున్నే ఏదో వార్త దొరికింది అనే ఉత్సాహం తో గబగబా రాబోయిన అరుణ నీళ్ళ తడి చూడకుండా కాలు జారింది. వామ్మో అంటూ అరిచిన అరుపుతో నేను. వెళ్ళినా , జరిగే దాన్ని అపలేను కదా , అలా ఇదిగో హాస్పిటల్ లో అడ్మిట్ చేయమని అనడం తో చేయక తప్పలేదు.

ఆ డాక్టర్ పిల్ల నేమో. అమె నడుముకి మర్దనా చేయాలి రోజూ రెండు సార్లు అని చెప్పింది. పిల్లలకు ఫోన్ లు చేస్తే మేము బిజీ అంటూ ఎలాగో నువ్వే చూసుకో నాన్న అంటూ కూతురు చెప్పడం వల్ల నేనే మర్ధన చేయడానికి పూనుకున్న ,కానీ అరుణ మాత్రం వద్దంటే వద్దు నాకు సిగ్గని భీష్మించుకు కూర్చుంది.

నేను మొగున్నె కదా , పర్వాలేదు అంటే అంతెత్తున లేచి, చివరికి ఏమి చేయలేను అని తెలిసి , ముడుచుకుని కూర్చుంది కానీ ముత్యమంత కూడా ముట్టనివ్వ లేదు. ఇళ్ళయినా ఇలాగే అనేదేమో , సరే ఏమి చేద్దాము అని ఆలోచిస్తుంటే అమృత ముర్తిలా అధుకుంది నళిని.

నళిని మా పక్కింట్లో మొన్ననే అద్దెకు దిగిన కొత్త జంట. వాళ్ళ గురించి నేనూ ఆఫీసు నుండి రాగానే ఎన్నో కబుర్లు అడేది అరుణ. వాళ్ళ ఇంట్లో పెద్దలు పెళ్లి కి ఒప్పుకోక పోవడం తో గుళ్ళో పెళ్లి చేసుకుని , ఇదిగో ఇలా చిన్న ఇంట్లో కి అద్దెకు దిగారు. ఎలాగైనా ఒప్పించాలని వారి ఉద్దేశ్యం. నళిని భర్త సాగర్ కి ఏం ఉద్యగo లేకపోవడం వల్ల ఇంటి వద్దే ఉంటూ నళిని కి అన్ని పనుల్లో సాయం ఉండేవాడు. దాన్నే మా అరుణ నేను వచ్చాక అతను ఏమేమి చేస్తున్నాడో చెప్పేది నేను అవన్నీ వింటూ నవ్వుకునే వాడిని,

చల్లని చెయ్యి నడుము మీద పడడం తో చటుక్కున లేచి కూర్చుంది అరుణ ఎవరంటూ, నేను కాదు లే అరుణా మన నళిని అంటూ నేను వెనక నుండి చెప్పడం తో హ్మ్మ్ అంటూ మూలిగింది అరుణ. నళిని వచ్చాక నాకు ఎంతో బరువు దింపుకున్నట్టు అనిపించింది.

వారం రోజులు మాకెన్నో విధాల అండగా,సాయంగా నిలిచారు నళిని ,సాగర్ అయితే కబుర్లు చెప్తూ వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాము అనే విషయం తెలియ కుండా చేశాడు. నళిని కూడా అరుణకి సేవలు బాగానే చేసింది.

ఇంటికి వచ్చాక కూడా అరుణకి స్నానం చేయించి, ఇల్లు శుభ్రం చేసింది. పెద్దమ్మ పడుకోండి . నిమిషం లో వస్తాము , బాబాయి గారు మీరు చెయ్యేమి కాల్చుకొకండి, నేనే తెస్తాను , మీరు రెస్ట్ తీసుకోండి ఆచెప్పి, వాళ్ళు వల్ల ఇంటికి వెళ్లారు.

నేను అరుణ గది లోకి వెళ్ళాను, నన్ను చూసి తల దించుకుంది అరుణ. అది చూసి నవ్వుకుని ,తన తల నిమురుతూ చూసావా నువ్వెన్ని మాటలు కథలుగా చెప్పినా, ఏన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు చిన్న పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు, కానీ మనం వాళ్ళను క్షమించాలి, మాట్లాడాలి. అంతే తప్ప కష్టం లో ఉన్నవారి గురించి తప్పుగా మాట్లాడకూడదు.

అవసరం అయితే సాయం చెయ్యి కానీ వారిని వెక్కిరించాలి అనుకోకు,మనం ఎంతో అపురూపంగా పెంచిన పిల్లలు, తల్లిదండ్రులు కష్టం లో ఉందంటే రాలేదు.ఎవరో కన్న బిడ్డలు వీళ్ళు మనకెంతో సాయం చేసి, అండగా నిలిచారు. నీకు అర్థం అవుతుంది అనే అనుకుంటున్నాను అంటూ చెప్పి , నేను స్నానానికి వెళ్ళాను.

” రేపు మీ అమ్మ వాళ్ళ తో నేను మాట్లాడతాను అమ్మా , నువ్వేమి బాధ పడకు ” అంటున్న అరుణ మాటలు స్నానం చేసి వచ్చిన నాకు లీలగా వినిపించడం తో నా పెదాల పై నవ్వు విరిసింది.

 

-భవ్యచారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *