కరుగునా మైనం??
మైన మైనా కరుగునా,
మౌనమైన ఈ మోము కి?
నా గానం నిన్ను చేరదు
పదం బరువెక్కిను
బాధ దాన్ని తడిపి వేసెను.
మైన మైనా కరుగునా,
మౌనమైన ఈ మోము కి?
వర్ష ధారల వయ్యారి ఊపులు
భావం తెలియని నా బాధ కి
అపశృతులు పలికెను.
మైన మైనా కరుగునా
మౌనమైన ఈ మోము కి.
నిను చేర నది
తల్లడిల్లెను
నా గొంతు న
అది బంధీ అయ్యెను.
మైన మైన కరుగునా
మౌనమైన ఈ మోము కి?
నీ మనసుకు లేవు కర్ణాలు
నీ మనో దృష్టికి అంధత్వం..
నా పాట నీకు గిట్టని ది.
నా బాట నీకు అగుపించని ది.
మైన మైనా కరుగునా
మౌనమైన ఈ మోము కి?
తప్పు నీది కాదు
నిన్ను చూసిన
నా హృదయ నేత్రాల ది.
నిన్ను విన్న నా మనో కర్ణాలది.
మైన మైన కరుగునా
మౌనమైన ఈ మోము కి.
నేను నీకు తెలియదు
నా గానం నిన్ను చేయరదు,
మౌన శిక్ష దానికి
నా గొంతుక చెరసాలలో.
మైన మైనా కరుగునా
మౌనమైన ఈ మోము కి?
నా అంధత్వము నాకు అందమే!
నీ అందము
నాకు అందని ఫలమే!!!
– వాసు