కార్మిక దినోత్సవం

కార్మిక దినోత్సవం

 

అందరి అవసరాలకు సూరీడులా వెలుతురిస్తూ

కష్టమే నమ్ముకుని కాలుతున్న సగటు జీవి శ్రామికుడు

శ్రమకు ఫలితం కోరగా శ్రమజీవికి ఊరటలేదుఎప్పుడు

చేతులు కాళ్ళే ఆయుధాలుగా
శరీర శ్రమనే పెట్టుబడిగా

భుక్తి కోసం శక్తిని ధారపోసి
రాత్రనకా పగలనకా యుద్ధమే

ఆస్తుల కోసం కాదు
హక్కుల కోసం కాదు
సాగే జీవనం కోసం కష్టం

నిరంతరం పనిచేస్తున్న
శ్రమ దోపిడీకి గురి అవుతున్న

అండదండలే అసలే లేక
రక్షణనన్నది అంతంతమాత్రం

కష్టానికి తగ్గ ప్రతిఫలం
నిత్య కార్మికునికి మిగిలేనా

భవంతులకురూపాన్ని తెచ్చినా
సమస్త వృత్తులకూ సమస్యలే

స్వేదానికి న్యాయం కావాలి
తరతరాలకు తరగని సౌభాగ్యం కలగాలి

మంచి కాలం వస్తుందన్న
యాంత్రిక జీవనంలో అభివృద్ధికి అడుగడుగునా పునాది వేస్తున్న కార్మికులందరికీ వందనం
శ్రమయేవ జయతే……

 

_ జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *