కర్మసాధనతో యోగ్యమని
ఆశల పగడపు దీవులు నిన్నడగని
ఉద్దేశాలు…మేఘమై పిలిచినా కదలని
బూటకాలు…నీలో నిదురించని భావాలతో
నిత్య స్వప్నమై కదులుతు కొలిచే దైవం
కొండంతది కాదని…కలగాని బతుకుల
సత్య దర్శణమని అంకితమవుతు…
ఒక నిర్వచనంగా సాగిపో…
ఆంతరంగికమున కరుడు గట్టి…..
భీష్మించుకు పోయిన భావాలకు
కోటి వెలుగుల దివ్వెలు కట్టి…ప్రపంచ
చ్ఛాయలను ప్రజ్వలన గావించుకో
పరమోత్తమ ధర్మాలని పగటి వెన్నల
పాన్పులను కిరిటంగా మోయకు…
నీలో నిర్ణయముందని నిరంతర
కార్యాచరణను గావించుకో…
నీవొక చైతన్యమై కదిలే కాలానికి
బాసటవవుతు…ప్రత నూతన పరిచయానికి
మొలిచిన గుణంగా కనబడుతు నైతికను
గుణపాఠంగా నేర్చుకొంటు సిద్దాంతాలలోని
అస్తికత్వం నడిపించే న్యాయకత్వమై….
ప్రకృతి ప్రాథమికాలకు అనుగుణంగా
నడుచుకో…
పరితాపపు ప్రాయచిత్తాలతో
హృదయపు సంకేతాలను ఆలకించు…
బీజమంతటిలో గల చీకటికి దారవుతు
తెరుచుకొన్న తేజానికి జాతి గౌరవాలను
కడుతు…సాధించడం నీధర్మమైతే…
వెలుతురు నీకొక ఆశయమవుతుందని
మానవ ధర్మం పోరాటం కాదని….
ఇది కర్మసాధనతో యోగ్యమని నీవుగా
తెలుసుకో…
-దేరంగుల భైరవ