కారణజన్ములు
రాముడు కారణజన్ముడు
శ్రీకృష్ణుడు కారణజన్ముడు
శ్రీ ఏసు కారణజన్ముడు
మహమ్మద్ ప్రవక్త కారణజన్ముడు
సోక్రటీస్ కారణజన్ముడు
ప్లేటో కారణజన్ముడు
అరిస్టాటిల్ కారణజన్ముడు
రూసో కారణజన్ముడు
వోల్టేర్ కారణజన్ముడు
మాంటిస్క్ కారణజన్ముడు
అనుకొని చిందర ముందర అయిపోకు
వాళ్లు చేసిన పనులు మనము చేస్తే మనము కాగలము
అందరూ మెచ్చిన పనులు
అన్ని మంచి పనులు
జనం కోసం ప్రాణాలు వదలడం
జనం కోసం జీవించడం
చేసిన వారు నిరంతరం కారణజన్ములు
ప్రక్క వారి కోసం ఆలోచించాలి
పక్కవారిని ప్రేమించాలి
తినడానికి తిండి లేకుంటే వారికి పెట్టాలి
ఆపదలో సాయం చేయాలి
స్నేహంతో నడిచి సాగాలి
ఇంతకన్నా మంచి వారు
మంచి సుగుణాలు ఎక్కడున్నాయి
పుట్టపర్తి సత్యసాయి కూడా కారణజన్ముడే
ఒక సామాన్యుడు సాధిస్తే విజయం
ఒక సామాన్య నిలబడితే అద్భుతం
ఒక సామాన్యుడు గెలిస్తే అది కారణజన్మం
-యడ్ల శ్రీనివాస్ రావు