కారణ జన్ములు
శ్రీరాముడు కారణజన్ముడు.
రావణాది రాక్షసులను వధించేందుకు శ్రీరాముడు
జన్మించాడు అని వాల్మీకి
తన రామాయణంలో చాలా
చక్కగా వ్రాసాడు. దుష్టశిక్షణ
చేయడమేగాక శిష్టరక్షణ
కూడా చేసాడు.విశ్వామిత్రుడు
దశరథ మహారాజు వద్దకు
వచ్చి శ్రీ రామ లక్ష్మణులను
తన యాగ రక్షణకై పంపండి
అని కోరగా దశరథుడు పంప
నిరాకరించగా, కుల గురువు అయిన
వశిష్ట మహర్షి సలహాతో తన కుమారులను
విశ్వామితృని వెంట పంపారు.
విశ్వామిత్రుని వెంట వెళ్ళిన
శ్రీరామ లక్ష్మణులు ఆ యాగ రక్షణ చేస్తూ తాటకిని,
ఆమెతో పాటు ఉన్న రాక్షసులను వధించి విశ్వామిత్రుని యాగం
పూర్తి అయ్యేవరకు రక్షణగా
ఉన్నారు.
యాగం పూర్తి అయిన తర్వాత
శ్రీరామలక్ష్మణులు ఆ విశ్వామిత్రునితో కలసి మిధిలా
నగరానికి వెళ్ళారు. అక్కడ సీతా దేవి స్వయంవరం జరగగా,
అందులో శివధనుస్సును విరిచి సీత
మనసును గెలుచుకుని
ఆమెను పరిణయమాడిన
రాముడు కారణజన్ముడు.
తండ్రిమాట నిలబెట్టేందుకై అరణ్యాల
బాట పట్టిన శ్రీరాముడు ఆదర్శ పుత్రుడే
అనటంలో సందేహం లేదు.
సీతాపహరణ జరిగాక ఆమెను
వెతికేందుకు శ్రీరామ లక్ష్మణులు
బయలుదేరగా వానర వీరుడు
సుగ్రీవుడితో పాటు హనుమ
ఆయనకు తారసపడ్డారు.
వాలిని వధించి సుగ్రీవుని
రాజుగా చేసిన రాముడు
స్నేహ ధర్మాన్ని చక్కగా
నిర్వర్తించాడు. సుగ్రీవుని
వానర సేన సహాయంతో
లంకలో ఉన్న సీతను
కనుగొని,వారధి నిర్మించి,
సాగరాన్ని దాటి ఆ రావణుని
వధించాడు శ్రీరాముడు.
శ్రీ రాముడు
కారణ జన్ముడు అనేది అక్షర
సత్యం.
-వెంకట భాను ప్రసాద్