కరగని హృదయం
ఆగని పయనానికి ఆయువునై..
సాగని గమ్యానికి తీరాన్నై..
ఏదో సాదించాలనే ఆరాటంలో..
మిగిలిపోయాను ఇలా బంధీగా..
నీ నిర్లక్ష్యపు వాకిట బందీనైన నేను..
మాటరాని బొమ్మనై ..
మూగబోయిన మది గదులను తెరవలేక ..
ప్రాణం ఉన్న శిలగా మారినా ..
కరగని నీ హృదయానికి ఏం తెలుసు ..
నే అనుభవించే వేదన.
-హైమ
Wow nice
అద్భుతం హైమ చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌