కపట ప్రేమ
శైలూ! నువ్వంటె నాకు ప్రాణం తెలుసా? అన్నాడు సుదీప్ ఇలా చెప్పడం వందో సారి..
ఐనా శైలజ మనసు మారలేదు..
ఈ వయసులో ఇలాంటివి చాలానే చెప్తారనుకుని కామ్
గా ఉండేది..
సుదీప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూనె ఉన్నాడు శైలజను
నమ్మించడానికి..
తన కిష్టమైన చాక్లెట్లు తెచ్చే వాడు ఫ్రెండు ద్వారా
ఇప్పించే వాడు..
ఫ్రెండ్స్ తో చెప్పించే వాడు..
ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా శైలజ లొంగలేదు..
ఒకసారి విషం బాటిల్ తెచ్చి తాగుతానని నువ్వు లేని ఈ బ్రతుకు నాకు వద్దని విషం తాగబోతే అప్పుడు
నమ్మింది పిచ్చి శైలు..
అంతే! పెద్దలను ఎదిరించి సుదీప్ ను పెళ్లి చేసుకుని
అతనితో వెళ్లి పోయింది..
కొన్ని రోజులు బాగానె ఉన్నాడు..
ఆస్తి పరుడైన తండ్రి ద్వారా ఏమీ ఆస్తి రాలేదని వాడి
పాచిక పారలేదనేమెా శైలజను చిత్రహింసలకు గురి చేసాడు..
ఇక తట్టుకోలేక తండ్రి ఇంటికి పారి పోయి వచ్చేసింది
కాబట్టి ఆడపిల్లలు మీరు జాగ్రత్త!
ఈ కాలంలో ఇలాంటి మెాసాలు కపట ప్రేమలు నమ్మ
కూడదు..
ప్రేమను గుర్తించి మెదలండి..
-ఉమాదేవి ఎర్రం
మంచి మెసేజ్ ఇచ్చారు.
మీరు చెప్పింది నిజమే మేడం..