కనులునీవాయే
రహీమ్ , కళ్యాణి ఇద్దరు పక్క వపక్క ఇళ్ళ వారు . వారిరువురు కలిసి చిన్నప్పటి నుండి కలిసి ఒకేపళ్ళెంలో చదువుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరూ ఇద్దరూ సింగరేణి కార్మికులు కావడం వల్ల క్వార్టర్స్ లో గడిపేవారు. వారి స్నేహం తో పాటు వారు కూడా పెరిగి పెద్ద అయ్యారు. రహీమ్ చాలా మొహమాట స్తుడు. కళ్యాణి మాత్రం చాలా హుషారుగా చాలా బాగుంది. తాను ఎప్పుడూ మంచి డ్యాన్సర్ కావాలని తన కల . తన కల కోసం పట్టు బట్టి మరి తండ్రితో ఆ ఊర్లో ఉన్న ఒక పాత నాట్యాచార్యుడు దగ్గర కు వెళ్లి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది.
కళ్యాణి కి అన్నలు ఇద్దరు కళ్యాణి చిన్నది కాబట్టి తాను ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగింది. ఎవరు తనని ఏమి అనేవారు కాదు. అందరూ గారాబం చేసేవారు. అందరితో తాను కూడా బాగానే ఉండేది. కళ్యాణి తండ్రికి బాధ్యతలు ఎక్కువ లేవు కాబట్టి ఉన్నంతలో బాగానే ఉన్నారు.
ఎటొచ్చి రహిం వాళ్ళ కుటుంబమే కాస్త తక్కువ అని చెప్పొచ్చు , రహీమ్ తన కుటుంబం లో పెద్ద వాడు. తన తర్వాత నలుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. ఉండడం తో ఎప్పుడూ బాధ్యత బందీగా ఉండేవాడు. అయినా కళ్యాణి కనిపించగానే అతని కళ్ళలో ఒక విధమైన కాంతి పెరిగేది. ఎన్ని బాధ్యతలు ఉన్నా అవన్నీ మర్చిపోయి తనతో కబుర్లు చెబుతూ ఉండేవాడు.
అలా వాళ్ళిద్దరూ పెరిగి పెద్దయ్యాక కళ్యాణి పెద్ద మనిషి అయ్యింది. ఆ కొన్ని రోజులు రహిం తాను మనిషిగా మాత్రం ఉండలేకపోయాడు. ఎందుకంటే తను కళ్యాణి నీ చూడకుండా ఒక్క రోజుకూడా ఉండేవాడు కాదు అలాంటిది పన్నెండు రోజులు కళ్యాణి మీ చూడకుండా ఉండలేక పోయాడు. అలాగని ఇంట్లోకి వెళ్ళాలని రెండు మూడు సార్లు చూస్తే అతన్ని చూసిన కళ్యాణి తల్లి నాయనా రహీమ్ ఈ రోజుల్లో అమ్మాయి రావడం కుదరదు. కానీ ఏమైనా నోట్స్ ఉంటే ఇవ్వు తను రాసుకుంటుంది. అంటూ హెచ్చరించింది. దాంతో అతను వెళ్ళే ప్రయత్నం మానుకున్నారు.
పన్నెండు రోజుల తర్వాత కళ్యాణి మళ్ళీ స్కూల్ కి రావడం తో రహీమ్ ఆశ్చర్య పోయాడు. కొత్త అందాలతో అలరారుతున్న కళ్యాణి అతనికి పంచ కళ్యాణి లా కనిపించింది. తను కూడా కొత్త గా రహీమ్ ను చూస్తూ సిగ్గును అభినయించిoచింది. . ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. కానీ నోట్స్ కోసం మాట్లాడ వలసి వచ్చింది. అయినా వారి మధ్య ఏదో సన్నని తెర అడ్డుగా ఉండిపోయింది.
అయితే కళ్యాణి కి నాట్యం పై ఇన మక్కువ పెరిగింది. దాంతో పదవ తరగతి ఎలాగోలా పూర్తి చేసి నాట్యం నేర్చుకుంటాను. అంటూ పట్టుబట్టి మరి పట్నానికి బయలు దేరింది.
వెళ్ళే ముందు రహీమ్ ను కలిసింది కళ్యాణి. ఇద్దరికి మాటలు కరువయ్యాయి. కానీ రహీమ్ మాత్రం ఎలాగో గొంతు పెగుల్చుకుని కళ్యాణి ఇన్ని రోజులు నిన్నూ చూడకుండా నేను ఉండలేను. నేను నిన్ను ఇష్ట పడుతున్నాను ఆ విషయం నీకు తెలుసు అనుకుంటున్నా మరి నీ నిర్ణయం నాకు తెలియదు. నీకు తెలుసు నాకు బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ తీరిన తరువాత నేను పెళ్లి చేసుకోవాలి. మరి ఏమంటావు కళ్యాణి అన్నాడు రహీం.
రహీమ్ నీకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టం అని కానీ నా ఆశయం నాట్యకళ కారిణి కావాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని నా ఆశ. అది తీరిన తర్వాత ఇంకేవిషయం అయినా ఆలోచిస్తాను అంటూ తన ఉద్దేశ్యం కూడా చెప్పేసరికి రహీమ్ ఆనందం అంతా ఇంతా కాదు. తాను అనుకున్నట్టే కళ్యాణి కోసం కష్ట పడలి అనుకున్నాడు. ఇద్దరూ ఒకరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసుకున్నారు. మన ఇద్దరు బాధ్యతలు తీరే వరకు ఎలాంటి పరిస్థుతులు వచ్చినా లొంగ కూడదు అని, ఇక అదే చివరి సారీ మాటలు వారివి. వారు అక్కడ చాలా సేపు ఎన్నో కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్ళారు.
తెల్లారి బయలు దేరుతున్నకళ్యాణి ని చూస్తూ కన్నీళ్లు తుడుచుకోవడం మర్చిపోయాడు రహీమ్. కళ్యాణి కూడా యెవరూ చూడకుండా తన చేతితో, కళ్ళతో వెళ్లి వస్తాను అన్నట్టు సైగ చేసింది. చివరిగా వారి చూపులు కలిసి, విడిపోయాయి.
*****
కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టు అక్కడ కళ్యాణి నాట్యం నేర్చుకుంటూ ఉంటే ఇక్కడ రహీమ్ అనుకోకుండా తన తండ్రి చెయ్యి ఉద్యగం లో ఉన్నప్పుడు క్రషర్ లో పడడం తో తండ్రి ఉద్యోగం లో చెరవలసి వచ్చింది. తను ఇంజనీర్ కావాలనుకున్న ఆశలను సమాధి చేస్తూ తండ్రి బాధ్యతను తను తీసుకున్నాడు.
చెల్లెళ్లను తమ్ముళ్లను చదివిస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు.
ఇన్ని బాధ్యతల్లో తనకు ఒకే ఒక సంతోషం కళ్యాణి రాసే ఉత్తరాలు. వాటితో వాళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడుకునే వారు, అన్ని విషయాలు పంచుకునే వారు. కళ్యాణి నాట్యం నేర్చుకుని అరంగ్రేటం చేయడం కూడా జరిగింది. అయితే అక్కడికి రహీమ్ వెళ్ళలేకపోయాడు. కానీ కళ్యాణి మాత్రం మర్చిపోకుండా ఆ ఫోటోలను పంపింది. అవి చూస్తూ రహీమ్ తనను తాను మర్చిపోయాడు.
ప్రతి రోజు తాను పనిచేసే దగ్గర వాటిని చూస్తూ మైమరచి పోయేవాడు రహీమ్. కళ్యాణి దేశ, విదేశాలు తిరుగుతూ ప్రదర్శనలు ఎన్నో ఇవ్వడం తో ఆమెకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. డబ్బు కూడా బాగానే సంపాదించింది. కానీ అప్పుడే కళ్యాణికి ఎన్నో సంభందాలు రావడం మొదలైంది.
గొప్ప గొప్ప సంభందాలు రావడం వల్ల కళ్యాణి కి తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటూ ఒత్తిడి తేసాగారు. అయితే కళ్యాణికి ఈ మధ్య రహీమ్ నుండి ఉత్తరాలు రావడం తగ్గిపోయింది.దాంతో పాటు తల్లిదండ్రి పెళ్లి గురించి బెంగ పట్టుకుంది.అసలు రహీమ్ కి ఏం జరిగిందో తెలియదు. ఎందుకు ఉత్తరాలు రాయడం లేదో అని గందరగోళo లో పడింది. కానీ ఈ లోపు తల్లిదండ్రులు చాలా ఒత్తిడి తేవడం తో కళ్యాణి రహీమ్ విషయం చెప్పేసింది.
అది విన్న తల్లిదండ్రులు ఆశ్చర్య పోయి,a పై కోపానికి వస్తూ ఏంటి మన కులం కాదు. కనీసం మతం కాదు. పైగా గుడ్డి వాడిని ఎలా చేసుకుంటారు అంటూ ఇంతెత్తున లేచారు ఇద్దరు. అన్నలు కూడా కుదరదు అంటే కుదరదని తెగేసి చెప్పారు. అన్ని విన్న కళ్యాణి దిమ్మ తిరిగిపోయింది.
అసలు రహీమ్ గుడ్డి వాడు ఎలా అయ్యాడు అసలేం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుని తన తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలుసు అంటూ కోపంగా సమాధానం ఇచ్చేసరికి ఎప్పటికప్పుడు ఎవరికి చెప్పకుండా వెంటనే రహీమ్ దగ్గరికి పరిగెత్తింది.
ఆమె ఎటూ వెళ్తోంది అర్దం కాక అందరూ ఆమె వెనకాలే వెళ్ళారు బస్ లో వెళ్తున్నంత సేపు కళ్యాణికి. కి రహీమ్ గురించిన ఆలోచనలు. ఆమె కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నయి. తను ఉత్తరాలు రాయకపోతే, బాధ్యతలలో పడి మర్చిపోయి ఉంటాడు అని అనుకుంది. కానీ ఇలా జరిగి ఉంటుందని అసలు ఊహించలేదు. అసలు ఏమైందో అర్థం కాక తన హృదయం బరువెక్కి పోతుంది ఎప్పుడెప్పుడు తనని చూస్తా అన్నంత ఆరాటంగా తన మనసు బస్సు కన్నా వేగంగా తన దగ్గరికి పరుగెత్తసాగింది.
తెల్లారి పొద్దున్నే బస్సు ఆగింది. రాత్రంతా నిద్రలేకుండా, రేగిన జుట్ట్టు తో, చీరంతా ఏటో వెళ్తున్న సంగతి మరిచిన పరిస్థితిలో కూడా కళ్యాణి రహీమ్ ఇంటి వైపు పరుగెత్తసాగింది. ఆమె వెనకాలే ఆమె అన్నలు, తల్లిదండ్రులు కూడా వెళ్లారు. తన ఎటువైపు నడుస్తుందో అసలు తన ఒళ్లు తెలియని స్థితిలో రహీమ్ ని చూడాలనే ఆరాటం లో తను నడుస్తూ వెళ్తుంది అలా వెళుతూ వెళుతూ అతని ఇంటి ముందు ఆగింది.
****
అక్కడ ఆ పాడుబడ్డ ఇంటిముందు నులక మంచంలో ఒక వ్యక్తి కళ్ళకి అద్దాలు పెట్టుకొని చేతిలో కర్ర తో టక టక ఆడిస్తున్నాడు. అతని ముందున్న ప్లేట్ లోని అన్నo, మరోవైపు కుక్క తిన సాగింది . అతను కర్ర ఇంకోవైపు కొడుతున్న కూడా ఆ కుక్క భయపడకుండా అతని చేతిలో ఉన్న అన్నం తిన సాగింది.
ఇంతలో లోపల్నుంచి ఎవరో ఒక ఆవిడ వస్తూ ఒస్శో దినికేం తకువ లేదు. ఒక పని, పాట చేయవు పొద్దంతా తిని కూర్చుంటావు. ఇలా మమల్ని కాల్చుకు తినేబదులు చచ్చినా పోయేది అంటూ తిడుతూ కడిగిన నీళ్లు అతనిపై పడేలా పోసింది.
ఆ వెంటనే ఆ నీళ్లు అతనిపై పడకుండా అడ్డుగా కళ్యాణి వెళ్ళింది దాంతో ఆ నీళ్లు కళ్యాణి చీరపై పడ్డాయి. కోన్ కోన్ హై అంటూ ఆమె చూసుకోలేదు అంది..
ఆమెకు ఏమి సమాధానం ఇవ్వకుండా కళ్యాణి మెల్లిగా రహీం దగ్గరికి వెళ్లి కుక్క తింటున్న ప్లేట్ లో తీసి పక్కన పడేసింది. దాంతో కుక్క పారిపోయింది. ఆమె వెళ్లి రహీమ్ పక్కన కూర్చుంది. నల్ల కళ్ళద్దాలతో ఉన్న రహీం ఆమె శరీర వాసనను పసిగట్టి కళ్యాణి అంటూ పిలిచాడు.
కేవలం తన శరీర వాసన పసిగట్టి ఇంకా మర్చిపోని రహీం ని చూస్తూ ఎంతో పొంగిపోయి ఏంటిదిరహీమ్, అసలు ఎందుకు ఇలా జరిగింది అంటూ అతని ఎద పై వాలి ఏడవసాగింది.
వాళ్ళ మాటలు వింటున్న రహీమ్ తమ్ముడి భార్య నువ్వే నా కళ్యాణి అంటే, నీ వల్లే ఇలా గుడ్డివాడి లాగా మారిపోయాడు. అప్పుడప్పుడు నువ్వు పంపిన ఫోటోలు చూస్తూ మైమరచిపోయి చేస్తున్న పనిని కూడా పట్టించుకోకపోయేసరికి అతని కళ్ళల్లో నిప్పులు పడ్డాయి. దాంతో గుడ్డి వాడయ్యాడు.
మా గండానికి నికి దాపురించినవాడు. మూడు పుటాలా పెట్టలేక చస్తున్నాం. మళ్లీ ఏం చేద్దామని తగలబడ్డవు అమ్మ అంటూ ఆమె ఎన్నో మాటలు అంటున్న. అవన్నీ వింటున్న కళ్యాణి తన చేతితో ఆపు అన్నట్టు సైగ చేసింది. అది చూడగానే ఆమె మాటలు ఆగిపోయాయి.
కళ్యాణి తన ఏడుపు ఆపి, పరిస్థితి గ్రహించి, రహీమ్ చేతులు పట్టుకొని లేపి తన తల్లిదండ్రులకు రహీమ్ వాళ్ళ తమ్ముడి భార్యకు వినిపించేలా, చూడండి… నా వల్లే రహీమ్ గుడ్డివాడ అయ్యాడు అని అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే చిన్నప్పట్నుంచి మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఒకరం లేకుండా ఒకరం ఉండలేం. అతనికి కళ్ళు లేకపోవచ్చునేనే అతని కళ్ళు అవుతాను నేను అతనితో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదు.
నాకు అతనంటే ఇష్టం. నేను అతనికి నేనంటే అతనికి ప్రేమ. మా ఇన్నేళ్ల ప్రేమను ఎవరు చంపలేరు ఎవరూ విడదీయలేరు. అతను నా కళ్ళ ను ప్రేమించాడు. నేను అతని కనులు అవుతాను. నా కళ్ళు ని అతని కళ్ళు గా, అతని కళ్ళ ని నా కళ్ళుగా చేసుకుని అతని కాపాడుకుంటాను.
మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఇదే నా ఆఖరి నిర్ణయం దీన్ని ఎవరూ మార్చలేరు అంటూ అతని భుజంపై చేయి వేసి తన చేతిలో ఉన్న కర్ర తీసి పక్కన పారేసి తన భుజంపై అతని చేతిని వేసుకుని ముందుకు కదిలింది ధైర్యంగా….
-భవ్యచారు
కధ మనసుకు హత్తుకునేలా ఉందండీ.