కన్నీటి వరద
వానాకాలం వాన కురవటంసహజమే కానీ అతివృష్టివలన అందరూ ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగాడ్రైవర్లు. ఈ కధ అలాంటిడ్రైవర్ అన్నదే”ఏమండీ, జాగ్రత్తగా వెళ్ళిరండి.అసలే వానకురుస్తోంది.
రోడ్లుచెరువులను తలపిస్తున్నాయి.”అంది సుగణ తన భర్త అయిన మణితో. “నువ్వు చెప్పిందినిజమే సుగుణ. వాన పడుతోంది. రోడ్లు బాగలేదు.
కానీ ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలంటేమేం డ్యూటీ చెయ్యాల్సిందే.నిత్యావసర వస్తువులు, మందులు ఒకచోటి నుండిఇంకోచోటికి పంపాలన్నామేం డ్యూటీ చేయాల్సిందే.
డ్రైవర్ డ్యూటీ అంటేనే బాధ్యతతో చెయ్యాలి” అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు మణి. మణి వెళ్ళే వైపుకుఅలా చూస్తుండిపోయిందిసుగుణ.
అలా వెళ్ళిన మణి మళ్ళీతిరిగిరాలేదు. సరుకులులోడ్ చేసుకుని బయల్దేరిని మణి లారీ ఒక వాగులో చిక్కుకుంది. మణి లారీలోఉండటం వల్ల అతను లారీతోపాటు ఆ వాగులో కొట్టుకునిపోయాడు.
అతను కొట్టుకునిపోయిన విషయం ఎవరికీతెలియదు. సరుకులు సరైనసమయంలో చేర్చాలనే ఆతృతలో అతను వాగుదాటిపోవటానికి ప్రయత్నంచేసాడు.
తోటి డ్రైవర్లు వద్దని వారించినా అతను వారి మాటలు వినలేదు. అతని ప్రయత్నం సఫలం కాలేదు. లారీ ఆ వాగులో కొట్టుకుని పోయింది. ఆ తర్వాత వరదతగ్గాక లారీ దొరికింది.
కానీమణి దొరకలేదు. మణిమరణించాడని అతని భార్యఒప్పుకోవటం లేదు.
మణిశరీరం దొరకలేదు. కాబట్టి అతను ఎక్కడో ఒకచోటక్షేమంగా ఉండి ఉంటాడని ఆమె అనుకుంటోంది. ఆమె
అలా గుమ్మం వైపు చూస్తూనేఉంటోంది. ఆమె కన్నులనుండి కన్నీటి వరద ప్రవహిస్తూనే ఉంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని