కనబడుట లేదు
దేవుని పాదాల చెంతో
నల్లటి కురుల పాయల్లోనో
మెరిసే సౌందర్యం నీది
సౌకుమార్యంతో పచ్చదనం వాటికలో
తళతళల వీచికలలో ముగ్ధమోహనంగా
వెలుగులు చిమ్ముతుంటావు!
సౌందర్యాన్ని ఆస్వాదిస్తామని విర్రవీగుతూ
నగరాల మట్టివాసనలకు
కృత్రిమత్వపు ముఖం తొడిగాం మేము
అంతరాల అడ్డుగోడలతో
అభద్రతా జీవులమయ్యాం
ప్లాస్టిక్ సౌందర్యానికలవాటుపడ్డాం కదా
మనసుతడి ఇంకిపోతుంటే
కన్నీటి చుక్క కనబడకుండా పోయింది!
– సి.యస్.రాంబాబు