కామేశం కథలు- 2

కామేశం కథలు- 2

 

యే నాకు పెళ్లి అయ్యిందొచ్ ,నాకు పెళ్లయిందొచ్  అంటూ కప్పలా గేంతుతున్న కామేశాన్ని వెనకనుంచి వచ్చిన కాంతం చూసి ఒరేయ్ ,ఒరేయ్ ఆపరా ఆపు పెళ్లి వాళ్ళు చూశారంటే ఇంకేదో అనుకుంటారు. నీ సంతోషం పాడుగానూ ఇంటికి వెళ్ళాక నీ గదిలో దూరి ఎంతైనా ఏగురుకో ఇక్కడ మాత్రం నోరు మూసుకొని నేను చెప్పినట్లు చెయ్ అంటూ బుగ్గలు నొక్కింది తల్లి.

ఎగురుతున్న కామేశం తల్లి బుగ్గల నొక్కడంతో రెండు చేతుల్లో చెంబులు పట్టుకొని ఏంటే అమ్మ ఇంకా చిన్నపిల్లాడిలా నన్ను బుగ్గల నొక్కుతావేంటి నాకు పెళ్లయింది తెలుసా అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి.

ఏంట్రా అయ్యేది నీ మొహం మండ ఆ జుట్టు లేకపోయినా ఎలాగోలా మా బంధువుల అమ్మాయిని బతిమిలాడి ఎదురు పదింతలు ఇవ్వాల్సి వచ్చింది.అసలే కొనుక్కున్న పిల్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీ విచిత్ర విశేషాలను చూసి దడుచుకోగలరు జాగ్రత్త అంది తల్లి.

అవునే అమ్మ ఇంతకీ మొదటి కార్యం ఇక్కడా ?  లేకపోతే మన ఇంట్లోనా అంటూ ఆరాలు తీశాడు కామేశం ఆడపిల్లలా మెలికలు తిరుగుతూ. ఆ మెలికలు చూసిన కాంతం అబ్బో ఈ వేషాలు కూడా ఉన్నాయా దొరగారికి, కాస్త ఆగు ఇప్పుడు ముహూర్తాలు ఏమి మంచివి లేవట. వారం తర్వాతే మొదటి రాత్రి ముచ్చట్లు అప్పటివరకు పిల్లని కంగారు పెట్టుకుండా జాగ్రత్తగా మసులుకో అంది కాంతం కామేశానికి జాగ్రత్తలు చెబుతూ,

సరేలే అమ్మ నువ్వు ఎలా చెప్తే అలాగే అంటూ సరిగ్గా సర్ధుకొని కూర్చున్నాడు కామేశం. ఈరోజు సాయంత్రమే మన ఊరికి వెళ్ళిపోతున్నాం. అప్పటివరకు కాస్త నిలకడగా ఉండు అంటూ మరొకసారి చెప్పి బయటకు వెళ్లిపోయింది కాంతం.

బయలుదేరేటప్పుడు కూతురికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఆ తల్లి. మా పిల్లను కాస్త జాగ్రత్తగా చూసుకోండి వదిన గారు అంటూ బొటాబోటా కన్నీరు కాచింది. ఆమె కార్చిన నీరుతో కాంతం చేయు నిండిపోయింది. ఆ చేతిలో ఉన్న నీళ్లు పారబోసి కొంగు ఆమె కొంగుకే తన చేయి తుడుస్తూ, అలాగే వదిన గారు నా కూతురు కన్నా ఇంకా మంచిగా చూసుకుంటాను చెప్పింది కాంతం.

ముక్కు చిదబోతున్న ఆమెను చూసి చెంగున ఎగిరి పక్కకు జరిగింది కాంతం. ఆ చీమిడి తన చేతులకు ఎక్కడ పుస్తు oదోనని అనుకుంటూ పక్కన కాంతం లేకపోవడంతో పక్కనే ఉన్న భర్త పంచకు తన చీమిడి అంతా పూసింది వియ్యపురాలు. ఆయన అదే కండువాతో తన కళ్ళు తుడుచుకున్నాడు. కళ్ళతో పాటు మూతికి కంటిన చిమిడి ని నాలుక కూ నాకుతూ ఇదేంటి పుల్లగా ఉంది అనుకున్నాడు. అలా అనుకుంటూనే చప్పరించేశాడు. ఇక అప్పగింతల కార్యక్రమం అయిపోవడంతో అందరూ కారులో ఎక్కి బయలుదేరారు.

**********

మంచి ముహూర్తాలు లేకపోవడంతో పాటు పెళ్లయిన తర్వాత తిరుపతికి వస్తామని మొక్కుకున్నారు కాంతం దంపతులు. కొత్త దంపతులతో పాటు తిరుపతికి వెళ్దామని అనుకున్న వారికి కోడలు బయట ఉందని పనికిరాదని తెలిసి. తోడుగా కామేశాన్ని ఉంచి తామిద్దరం అయినా వెళ్లి రావాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా కామేశానికి జాగ్రత్తలు అన్నీ చెప్పి బయలుదేరారు.

అలాగే అంతవరకు ఎక్కడికి వెళ్లకపోవడంతో చుట్టూ పక్కల ఉన్న యాత్రలు కూడా చేసి వస్తామని మళ్లీ మనవడు, మనవరాలు పుడితే కుదరదని అనుకున్న కాంతం దంపతులు బట్టలు బాగానే సర్దుకుని బయలుదేరారు. వెళ్లేముందు కాంతం కొత్తకోడలి కవితకు కామేశానికి మంచిగా వండి పెట్టమని, ఈ వారం రోజుల్లో మీ జంట ఇద్దరూ కలిసిపోవాలని, ఆదర్శ దంపతులు లాగా ఉండాలని, వాడు ఏది వద్దన్నా కూడా కావాలనే అన్నట్టుగా గమనించుకోమని చెప్పింది.

ఎందుకంటే కొత్త భార్యవి కాబట్టి నువ్వు ఎక్కడ కందిపోతావో అని నిన్ను ఏది చేయవద్దని అంటాడు. అందువల్ల ఏం వద్దు, ఏం వద్దు అని అంటాడు.అలా అన్నా కూడా నువ్వు వాడికి చేసి పెట్టు , నీ వంటలతో వాడిని ఆకట్టుకో , నీ కొంగు కు కట్టేసుకో కొత్తకోడలా అంటూ అత్తలా కాకుండా తల్లిలా మంచి విషయాలు చెప్పింది కాంతం.

మెలికలు తిరిగిపోతూ అలాగే అత్తగారు అంటూ తన మెల్లకన్నుతో ఎటూ చూస్తుందో కూడా తెలియని కవిత వెళ్లి రండి అంది. తనను కాకుండా గోడను చూస్తూ వెళ్లి రమ్మంటుందేంటి అమ్మాయి అనుకుంటూ, ఏంటో ఈ పిల్లలు అని కాంతం మనసులోనే చిరాకు పడుతూ, పైకి మాత్రం జాగ్రత్త తల్లి అని వండింటి తాళాలు ఇచ్చి బయలుదేరింది.ఆ రోజు అలా గడిచిపోయింది. రాత్రి కామేశం తన గదిలో తాను పడుకుంటే కొత్త పెళ్లి కూతురు కవిత మరో గదిలో పడుకుంది.

*********

తెల్లారే గబగబా లేచి తన కాలకృత్యాలు తీర్చుకున్నా కవిత, కామేశం గది ముందుకు వచ్చింది లేపాలని. మంచం మీద కాలు పెట్టుకొని కింద పడుకున్న కామేశాన్ని వింతగా చూస్తూ ఏవండీ అంటూ పిలిచింది. ఆ గొంతు వినగానే చటుక్కున్న లేచి కూర్చున్నాడు కామేశం. వండ్రుపిల్లి గాండు పెట్టినట్టు ఉన్న ఆ గొంతు విని భయపడి లేచి చుట్టూ చూసి సరికి ఎదురుగా కొత్త పెళ్ళాం కనిపించేసరికి వీపు ని చేత్తో తట్టుకొని ఏ ఏమిటి అంటూ అడిగాడు గబారాగా , టిఫిన్ ఏం చేయాలండి అంటూ అడిగిoది.

నీ ఇష్టం అన్నాడు కామేశం తన లుంగి సర్దుకుంటూ అలాగే అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది కవిత. కవిత టిఫిన్ చేసే అంతలో కామేశం కాల కృత్యాలు తీర్చుకున్నారు. కొత్త భార్య కొత్తగా రుచులతో ఏ వండి పెడుతుందో అంటూ ఆశగా ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.

వంటింట్లోంచి ఘుమఘుమ లు వస్తున్నాయి ఏదో ప్రత్యేకంగా చేస్తున్నట్లుగా ఉంది అనుకున్నాడు కామేశం ఆకలి కాస్త పెరిగింది. హమ్మయ్య నాకు వంట బాగా వచ్చిన పిల్లనే దొరికింది ఈ వార్త నా స్నేహితులు అందరికీ చెప్పాలి అనుకున్నాడు మనసులో కామేశం.

ఇంతలో కవిత వస్తున్న అడుగుల శభ్ధం విని సర్దుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు, తనను పిలవాలని అనుకుంటూ, పిల్లి పిల్ల గండ్ర పెట్టినట్టు ఏమండి ఇదిగోండి టిఫిన్ అంటూ ప్లేట్ ముందు పెట్టింది కవిత.

ఆ పిలుపు విని ఈ సారి దడుచుకొలేదు కామేశం, కవిత ఏం చేసిందో తెలుసుకోవాలి అనే ఆసక్తి కొద్దీ కళ్ళు తెరిచి చూసాడు కామేశం. చూడగానే అధిరి పడి బాబోయి వద్దు నాకు టిఫిన్ వద్దు అంటూ లోపలికి పరుగెత్తాడు.

కవితకు అత్త కాంతం చెప్పింది గుర్తుకు వచ్చింది.వద్దు అన్నాడు అంటే కావాలి అని అర్థం అని అనుకుంటూ టిఫిన్ ప్లేట్ పట్టుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లి తీసుకోండి మీ కోసం ప్రేమగా చేశాను. ఎలా ఉందో తిని చెప్పండి అంది అదే పిల్లి గొంతు తో , ఈ సారి కామేశం తప్పించు కోలేదు ఎందుకంటే కవిత రామబాణం లాంటి ప్రేమ మీ కోసం అనే అక్షరాలు వాడడం వల్ల తాను ఏమనుకుంటుందో అని అనుకుంటూ ప్లేట్ అందుకున్నాడు. అలా అందుకునే క్రమం లో ఆమె చేతి వేళ్ళు తాకాయి. దాంతో కామేశం లోని వేడి పుట్టి , గబగబా ఆ ప్లేట్ అంతా ఖాళీ చేశాడు.

అది చూడగానే కవిత చాలా సంతోషిచింది. తనకు నేను చేసిన టిఫిన్ బాగా నచ్చినట్టు ఉంది.లేదా ఆ టిఫిన్ అంటే చాలా ఇష్టం కాబోలు అనుకుంటూ ఖాళీ ప్లేట్ తీసుకుంటూ మళ్లీ వేలు తాకించి పిలక జడ ఊపుకుంటూ వెళ్ళింది. కామేశం కవిత అలా వెళ్ళగానే ఇలా బాత్రూం లో దూరి నోట్లో ఉన్న ఉప్మనంత కక్కేసాడు.

అలా మొత్తానికి టిఫిన్ అయ్యాక ,మధ్యాహ్నం వంట ఏమిటి అంది కవిత. మళ్ళీ కామేశం నీ ఇష్టం అన్నాడు. మధ్యాహ్నం మళ్లీ గుమఘుమలు వచ్చాయి .ఈ సారి కొత్తగా ఉన్నాయి వాసనలు.అబ్బో నా కోసం ఏం చేస్తుందో అనుకుంటూ కురున్న కామేశం దగ్గరికి మళ్లీ జీడిపప్పు ఉప్మా తో వచ్చింది కవిత. తినక తప్పలేదు కామేశానికి,

వద్దని చెప్పలేడు,ఎందుకంటే తల్లి కవిత ఏది పెట్టినా కాదు,వద్దు అనకుండా తినమని,వంకలు పెట్టకు అంటూ క్లాసు పికి వెళ్ళింది కాబట్టి కిక్కురు మానకుండా తిన్నాడు కామేశం.

ఇక రాత్రికి కూడా బాదం పప్పులు బాగా వేసి,కిస్మిస్,కాజు తో కలర్ మార్చి మళ్లీ ఉప్మా నే చేసింది కవిత. మళ్ళీ మూసుకుని తిన్నాడు కామేశం.

వారం రోజులు చేసింది చేసినట్టుగా కాకుండా రకరలుగా ప్రయోగాలు చేస్తూ కామేశానికి ఉప్మా తో కొత్త రకాలు అన్ని వండి పెట్టింది కవిత. కామేశం తినడం బాత్రూం లోకి వెళ్లి కక్కడం,, ఇలా వారం రోజులు అయ్యేసరికి కామేశం కట్టే పుల్లలా తయారు అయ్యాడు. ఆ రోజు కూడా కవిత ఇంకో ప్రయోగం చేస్తుండగా యాత్రలు అన్ని ముగించుకుని వచ్చిన కాంతం దంపతులు వచ్చారు.

కామేశం తల్లిని చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్టు అయ్యాయి, అమ్మా అంటూ ఆడపిల్ల తల్లిని పట్టుకొని వలవలా ఏడవడం మొదలు పెట్టాడు. ఏంటి రా ఏమైంది రా కామేశం ఇలా అయ్యావు.గుమ్మడి పండు లా ఉండేవాడివి, గెడ కర్రలా అయ్యావు అంటూ ఆతృతగా అడిగింది కాంతం. అమ్మా నన్ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే లేకుంటే నేను దక్కను అంటూ సృహా తప్పి పోయాడు కామేశం . వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు కామేశాన్ని.

నాలుగు రోజులు గుల్కాజ్ బాటిల్స్ ఎక్కిస్తే తప్ప కామేశం మళ్లీ మనిషిలా మారలేదు. ఈ నాలుగు రోజులు పళ్ల రసాలు మాత్రమే తాగించారు.

అయిదో రోజు పొద్దున్నే కామేశం ఇంటికి డిశ్చార్జి అయ్యి వచ్చాడు. కాంతం కోడలు కవిత ను పిల్చింది. అమ్మా కవిత వాడికి వేడిగా ఏదైనా చేసి తీసుకు రా ఇన్ని రోజులు పళ్ల రసాలు మీదే ఉన్నాడు అంటూ చెప్పేసరికి అలాగే అత్తయ్య అంటూ నిమిషం లో వెళ్లి అద్ద గంటలో ప్లేట్ పట్టుకుని వచ్చింది కవిత . అది చూసి వామ్మో బాబోయి అంటూ మంచం పై నుంచి లేచి పరుగెత్తాడు కామేశం .ఇంతకీ కవిత తెచ్చింది ఏంటో తెలుసా జీడిపప్పు ఉప్మా అండి.

అవును మీరు విన్నది నిజమే కవిత చేసింది ఉప్మా నే. కామేశానికి అసలు ఉప్మా అంటే పడదు, ఆ విషయం కొత్త కోడలికి కాంతం చెప్పక పోవడం, కామేశం కొత్త భార్య ఏమనుకుంటుందో అనే ఆలోచన తో, తల్లి చెప్పినట్టు పెట్టినదానికి వంకలు పెట్టకుండా తిను అని చెప్పి వెళ్ళడం దాంతో కామేశం కవిత కు చెప్పకుండా ఉండడం వల్ల కామేశం ప్రాణాలు పోయినంత పనైంది. అదండీ కామేశం ఉప్రేసం కథ.

ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కవితకు వంటలేవి రావు. ఒక్క ఉప్మా తప్ప. ఇక జీవితాంతం కామేశం తప్పించుకోలేడు. లేదా కవిత కొత్త వంటలు నేర్చుకుంటుందా? లేదా అనేది మరొక భాగం లో చూద్దాం.

 -భవ్యచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *