కామాంధుడి మాయ
సలసల మరుగుతుంది నా రక్తం
నా కళ్ళు ఎర్రబడిన కూడా
నా ఎదురుగా ఉన్న మనిషి మీద కోపం చూపించలేను
నా పరిస్థితులు కారణంగా నేను ఉద్యోగం చేస్తున్నా
వాడు ఒక కామాంధుడు అని తెలుసుకోలేకపోయా
వాడి దగ్గరికి వెళ్లాలంటే నేను గజగజ వణుకుతున్నా
వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటున్నా
కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు…
మదిలో మెదిలే అనేకమైన ఆలోచన వల్ల
అసలు ఏ ఆలోచనలు రావడం లేదు
నాలో భావాలను వర్ణించలేని భావంగా మిగిలిపోతూ
వాడి ఆగడాలు చూడలేక
నాలో సహనం నశించిపోయి
నేను వాడిదారిలోనే వెళ్లి బుద్ధి చెప్పాలి అనుకున్నా
వాడి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ
నేను వాడి నుంచి తప్పించుకుంటూ
వాడి బెదిరింపులకు భయపడి
ఇవన్నీ నాలోనే అనుకున్న మాటలు
వాడిన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే
మొదటిగా అనుమానం వచ్చేది ఎంప్లాయిస్ మీదే…
కామాంధుడి మాయలో పడకుండా
నన్ను నేను కాపాడుకుంటూ
వాడి దగ్గర కాలం గడుపుతున్నాను
నా పరిస్థితుల్లో గుర్తుకొచ్చి
ఇలాంటి పనులు చేయలేకపోతున్నా
వాడి మీద నాకున్న వర్ణించలేని భావంగా మిగిలిపోయింది.
-మాధవి కాళ్ల