కల్లైన బాసలు

కల్లైన బాసలు

 

ఏమి సమాజమో అర్ధమవకున్నది..
ఏ శతాబ్ధమో ఆగమాగమవుతున్నది…
నాగరికత మోజున మసికాబడుతున్నది…
ఆలోచన చేయకుండ ఆగమాగమవుతున్నది….
అరచేతిన వైకుంఠపు తీరులెక్కగున్నది….

సాయమంటె చాటేసే బంధాలే ఎక్కువాయె…
బంధాలకి బలమెక్కడ లేకుండా పోయెనాయె..
అనురాగం ఆప్యాయత కల్లబొల్లి మాటలాయె…
ప్రేమ నిండా అవసరాలు నిండిపాయె…
సెల్ ఫోనులు రాజ్యములో
అందరున్న ఒంటరులమాయె..

స్నేహంలో స్వార్ధమనే చీకట్లు దాగిపోయె…
సంపదకే ఓటేస్తూ చూపులన్ని అటు సాగిపోయె…
బీదవాడు కంటికి కానకుండా మాయమాయె..
మధ్యతరగతి జీవితాలు కానరాని నిశీధులాయె…
ఆశయాల భవితవ్యం మత్తుకి బానిసాయె…

ఐదేండ్లకి ఒకసారి మీకెందుకు మేమున్నామన్న నాయకులు..
ఓటు వేసి గెలిచాక ఎవరుమీరు ఎవరికెరుకంటరు…
నీటిమీద రాతలాయె చేసిన బాసలన్ని….
జీవితాలు గుదిబండలాయె ఓటరుగా ఓడిపోయి…
భారమంత పీకకి చుట్టె చెత్తకి కూడ పన్నులేయబట్టి…

ఏమవుతున్నది ఎటుపోతున్నది…
చదువుకున్న ఓటరులూ చదువురాని ఓటరులూ…
ఓటుని అమ్ముకోక హక్కుగా దాచుకోండి…
నచ్చని వాడికి అమ్ముడుపోయి కాలమంత ఏడవకండి‌‌‌…
తెలివిగ మసలుకోండి భవితవ్యం మార్చుకోండి…
కలత చెందక యోచించండి‌ కల్లైన బాసలు నెరవేర్చుకొనగ….

కల్లైన బాసలు అనే ఈ రచన కేవలం అక్షర లిపి కొరకు వ్రాసినదని హామీ‌ ఇస్తున్నాను.

– ఉమామహేశ్వరి యాళ్ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *