కల్ల బొల్లి మాటలు
ఉన్నదో లేనిదో తిని నా
ఇంట్లో నేను పడి ఉంటే…
ఇల్లు చొచ్చుకొని వచ్చి
కల్లి బొల్లి మాటలతో..
మనసులో ఈర్ష ద్వేషాలు పెట్టుకొని
పైకి ప్రేమ పూర్వకంగా నటించే
మాటలు మాట్లాడుతూ ఉంటే..
నా క్షేమం కోసం పిల్లల ..
శ్రేయస్సు కోరే కదా వీళ్ళు
అన్ని అడుగుతున్నారని..
అడిగినా కొద్ది చెబుతూ ఉంటే..
నా ఇంటి గుట్టు లాగి తీసుకువెళ్లి
అందరిలో చెబుతూ నా భర్తకు చెబితే..
తను వచ్చి నా పరువు అంతా తీస్తున్నావా..
అని నామీద ఎగబడుతూ ఉంటే…
మళ్లీ వాళ్లే వచ్చి సర్ది చెప్పి
తనకు వాళ్లు మంచివాళ్లాయే..
నేను చెడు చేసిన దాన్ని అవుతుంటిని..
నా ఇంట్లో నేనున్నా నన్ను నిమ్మలంగా బ్రతకనీయకుండా
నా మనోభావాలు దెబ్బతీయడం నాకు నచ్చక
ఎవరిని ఎక్కడ ఉంచాలో..
అక్కడే ఉంచడం తెలుసుకొని
నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను.!!
అయినా కూడా వదలక
నా ముందు పొగుడుతూ.
నా వెనక తిడుతూ ఉంటే
ఆ మాటలు చెవిన పడి
నా మనోభావాలు దెబ్బతింటున్నా
ఓర్వ లేని లోకం పోకడ అంతేలే..!!
అని నా మనసుకు నేను సర్ది
చెప్పుకుంటూ కాలం గడుపుతున్నా..!!
-బేతి మాధవి లత
శైల