కలి
కలికాలంరో, బాబోయ్
కలికాలంరో, ఆకలి
అంటే
అర్థాలు “వేలు” ఉండునురోయ్ !
అసలే పట్టనిది
పేదోనిదిరోయ్ !
పట్టినా, పట్టునది
ధనికుడిదిరోయ్ !
అస్సలు ఎకసక్యమే కానిది
నాయకునిదిరోయ్ !
నిత్యక్షుద్భాద
వ్యాపారి దిరోయ్ !
కలికాలం రోయ్, బాబోయ్
కలికాలంరోయ్, ఆకలి
అంటే అర్థాలు ‘వేలు’ ఉండును రోయ్ !
కడుపు నిండన్కి బుక్కెడు,
గుక్కెడు గంజి చాలును రోయ్ !
అది కూడా దక్కదు
పేదోనికి రోయ్ !
పేరు మార్చి ‘సూపు’ అంటారు
మన తారలురోయ్
బక్క చిక్కి అందం అంటారు
వీరిని ఏమనాలిరోయ్ !
– వాసు