కలేకూరి ప్రసాద్
కుల మత దురహంకారంతో
కుత్తుకలు కోస్తున్న ఈ సమాజములో….
కత్తులతో కాకుండా కలంతో
పోరాడిన ఓ యువక కవితా సంపన్నుడా…
నీ నరనరాల్లో ఉన్న రక్తం అంతటిని
పెన్ను సిరల్లో ఎక్కిస్తూ…
నీ రక్తం చుక్కలతో రాస్తున్న
ప్రతి అక్షరం…
పేదల గుండెల్లో
పెను మంటలులై రగిలింది…
పెను తుఫానుల తిరగబడింది…
అంటరానితనం,
అవమానం,
ఆకలిమంటలతో ఈ సమాజాన్ని
ఒక రాచపుండుల పీడిస్తున్న
అగ్రకుల అహంకారం వ్యవస్థని
నీ దిక్కార స్వరమై రాస్తున్న నీ కలం
కన్నీటి గోసలు, యతలు చెప్తున్నప్పుడు…
వాళ్ల ఒంటిలో వణుకు పుట్టింది…
వాళ్ల గుండెల్లో గూటం దెబ్బల
శబ్దాలు వినబడ్డాయి…
మెదడులో నరాలు మెలికలు
తిరుగుతూ చిట్లి పోయాయి…
కసితో రాస్తున్న నీకలం
వారి కడుపుల ప్రేగులు
కత్తులతో కోసినట్లయింది…
కసి కసిగా రాస్తున్న నీ కలం
వారి కంఠములను నరికినట్లు
అయింది…
కుల మతానికి
ఎవరు దిక్కులేని ఎడారిలో
పక్షవాతం వచ్చినట్లయింది…
అయినా కూడా
అది విసర్జించిన విష వాయువు.
విషవలయం వలె ఈ దేశాన్ని
చుట్టిముట్టి కబలిస్తూనే ఉంది…
******
కలేకూరి ప్రసాద్ (1964 అక్టోబర్ 25 [1] – 2013 మే 17) కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు.
– బొమ్మెన రాజ్ కుమార్