కాలం మారింది
ఇప్పుడంటే అన్ని కాలాలు ఒకేసారి వస్తున్నాయి కానీ కొన్నాళ్ల క్రితం ఏ కాలంలో అదే కాలం వచ్చేది. ఎండాకాలంలో ఎండా వాన కాలంలో వాన చలికాలంలో చలి ఇలా వచ్చేది. ఇప్పుడు పర్యావరణం నాశనం చేశారు కాబట్టి ఒక్కొక్క ఎండాకాలంలోనే వర్షాన్ని చలిని చూడాల్సి వస్తుంది.
అయితే ముచ్చట అది కాదు ఇంకొకటుంది అదేంటంటే వానాకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ముందుగానే కొత్తగా కోసిన వరి పంటను కొనేవారు దాంతో పాటు చింతపండు కారప్పొడి ఉల్లిపాయలు కొని పెట్టేవారు.
ఎందుకంటే తక్కువ ధరకే వస్తాయి అలాగే ఈ మూడు ఉంటే ఎలాంటి పరిస్థితిలో అయినా పిల్లలు ఆకలితో ఉండకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ నాలుగు ఎక్కువగా కొని పెట్టేవారు.
ఇక వర్షాకాలంలో కొత్తవారి వంట కాబట్టి అన్నం వండితే ముద్దగా అయ్యేది. మా అమ్మగారు ఉల్లిగడ్డ కొత్త చింతపండుతో ఉల్లిగడ్డలు పెద్దగా కోసి అల్లం వెల్లుల్లి ముద్దగా నూరి అందులో వేసి పులుసు చేసేవారు దాన్నే ఉల్లిగడ్డ పులుసు అని అంటారు.
ఈ ఉల్లిగడ్డ పులుసు కోసం అమ్మ పాత చింతపండు వాడేది. కొత్త చింతపండు అయితే రుచి రాదు అని నాన్నగారు అనేవారు. అందువల్ల పాత చింతపండును నానబెట్టి పులుసు తీసి. ఉల్లిగడ్డలల్లో చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఏరి ముందు వెనక పొట్టు తీసేసి కోసి అవి అలాగే వేసి పులుసు మరిగించేది.
మా నాన్నగారు రూమ్ లో చదువుకుంటున్న మాకు ఆ పులుసు వాసన కడుపులో ఎలుకలు పరిగెట్టించేది. ఇక వంట అయిన తర్వాత తినడానికి పిలిచేది. దాదాపు 7 8 గంటలలోపే మేము తినేసేవాళ్లం. ఎందుకంటే కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. పైగా అప్పుడు మాకు మీటర్ లేదు వైర్లు వేసుకొని కరెంటు పెట్టుకునే వాళ్ళం.
వంటింట్లో అందరికీ ఆసనాలు వేసేది మా అమ్మ. ఆసనాలు అంటే వేటికవే అనుకునేరు. అలా కాకుండా బియ్యం సంచులు ఉంటాయి కదా, ఆ సంచులు అన్నిటిని ఒక దగ్గరగా వేసి పెద్ద సంచి లాగా కుట్టి అందరికీ ఒకేలా వేసేది.
ముందు దాన తర్వాత తమ్ముళ్లు ఇద్దరు తర్వాత నేను కూర్చునేవాళ్ళం.
అమ్మ వంట అంత తీసుకొచ్చి ముందు పెట్టి అందరికీ వడ్డించేది. లట్టిగా మారినా అన్నాన్ని కంచంలో పెట్టి దాని పక్కన గట్టిగా చిక్కగా అయినా ఉల్లిగడ్డ పులుసు పోసేది. ఆ వేడివేడి అన్నంలో ఉల్లిగడ్డ పులుసు పోసుకొని తింటే ఉండేది స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందన్నట్టుగా చల్లగా చలికి కడుపులోకి వెచ్చగా దిగుతుంటే ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఒక్క అమ్మ చేతి వంట తిన్నవారిలోనే తప్ప.
తినే కొద్ది తినాలి అని అనిపించిందా తినేసే వాళ్ళం గబగబా, ఎంత తిన్న కడుపు నిండేది కాదు. ఇక మా అమ్మ చాలు మీకు అని అనేది ఎందుకంటే మేము చిన్న పిల్లలం మాకు కడుపు గుర్తు తెలియదు అని తర్వాత మోషన్స్ పట్టుకుంటాయేమో అనే భయంతో అలా అనేది.
అమ్మ నిజంగా అని మేము అమ్మను తిట్టుకునే వాళ్ళ o మనసులో, ఇక నాన్నగారు కూడా చాలు ఇక లేవండి. ఇక నాన్నగారు కూడా చాలు ఇక లేవండి చదువుకోవాలి అని అనడంతో, మా నాన్న ఎప్పుడూ చదువు చదువు అని తిడతాడు హాయిగా హెచ్చగా పడుకుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ చేతులు కడిగేసుకునేవాళ్ళం.
ఆపై కాసేపు నాన్న వరండాలో తిరుగుతూ మాతో ఎక్కాలు అప్పజెప్పించుకునే వాళ్ళు. పులుసు తిన్న నోరు తో ఎక్కాలు తప్పుగా చెప్తుంటే, మరోవైపు కళ్ళు వాలిపోతూ ఉండేవి నిద్రతో దాంతో ఎక్కాలు తప్పుగా చెప్పే వాళ్ళం అప్పుడు నాన్నగారు ఒక పది రౌండ్లు అటు ఇటు తిరగండి అని అనేవారు అంటే తిన్న తర్వాత వాకింగ్ చేయాలని ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అది మేము ఎప్పుడో చేసేసాము అన్నమాట.
ఇక వేడివేడి అన్నం ఉల్లిగడ్డ పులుసు తలుచుకుంటూ ఇంతలో అమ్మ మాకు బట్టలు వేసి వచ్చేది. రెండు బొంతలు వేసి దానిపై ఒక బ్లాంకెట్ వేసేది. అందరికీ సన్న చెద్దర్లు ఇచ్చేది. ఇక నాన్నగారు వెళ్లి పడుకోండి అని అనేవారు. వెచ్చగా అన్నం లోపల దిగడంతో కళ్ళు మూతలు పడుతుండగా వెళ్లి ఆ బొంతలో ఎవరు మెత్తల మీద వాళ్ళం హాయిగా పడుకొని నిండా కప్పుకునేవాళ్లం. మళ్లీ తెల్లారి జామున నాన్నగారు 4:00కు తత్వాలు పాడే వరకు మాకు మేలుకో వచ్చేదే కాదు.
నాన్నగారు తత్వాలు పాడుతూ మమ్మల్ని లేపి మాతో వాటిని వల్లే వేయించేవారు. నరసింహ శతకం, చిన్న చిన్న వేమన పద్యాలు హనుమాన్ చాలీసా లాంటివి కంటత వచ్చేవరకు వల్లే వేసే వాళ్ళం రోజు కొంచంగా నేర్పించేవారు.
ఇప్పుడు ఆ లక్కీ అన్నం లేదు ఉల్లిగడ్డ పులుసు లేదు ఒకవేళ చేసుకున్నా కూడా అన్నం ఉడకదు, పుల్లలు పుల్లలుగా ఎన్ని నీళ్లు పోసినా అలాగే ఉంటుంది తప్ప లట్టి అవదు. ఇక ఉల్లిగడ్డల మాట అంటారా వందకు ఆరు కిలోలు చొప్పున అమ్ముతూ మురిగిపోతున్న పంటను తెచ్చుకుంటున్నాం కాబట్టి అది రుచిగా ఉండదు.. అలాగే కారప్పొడి చింతపండు కూడా కల్తీ చేస్తున్నారు కాబట్టి ఏమి తిన్న ఎన్ని విధాలుగా చేసుకున్నా అప్పటి రుచి రాదు.
మనం కూడా పొడి పొడి అన్నానికి అలవాటు పడిపోయాము. కల్తీ ధాన్యానికి కల్తీ సరుకులకు రకరకాల రుచులకు అలవాటు పడి, ఏ మందులు వేయకుండా పండించిన కంట్రోల్ బియ్యాన్ని, మందులు వేయకుండా ఎరువుతో పండించిన ఉల్లి పంటను మనము కోల్పోయాం, ఇంతకీ మనం మంచి ఆహారం తింటున్నామా అంటే లేదనే చెప్పవచ్చు. ఏ కూర లేకుండా ఒక్క పులుసుతోనే కిలో అన్నం తినే మనం ఇప్పుడు పది రకాల కూరగాయలు ఉన్న పావు కిలో అన్నం కూడా తినలేక పోతున్నాం.
పైగా తెల్లని అన్నం తింటే రోగాలు వస్తాయని భయపడుతూ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ అంటూ రకరకాల పోషక విలువలు లేని ఆహారం అదే పోషకాహారం అనుకుంటూ తింటూ గొప్పలు చెప్పుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా కల్తీ మందులు అంటగడుతూ రైతులను మంచి పంట పండించకుండా ఆకర్షించి కల్తీ మందులు ఇస్తూ మంచి పంటను పండించలేకపోతున్నారు.
పైగా దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తున్నాం అంటూ గొప్పలు చెప్తూ ఓట్లు అడుక్కుంటూ మన ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ గమనించే తీరిక ఓపిక సమయం మనకి ఎక్కడిది ప్రొద్దున లేవగానే డబ్బు సంపాదించాలని పెద్ద పెద్ద బిల్డింగులు మేడలు కట్టుకోవాలని ఆశతో అత్యాశతో పరుగులు పెట్టే మనం ఇవన్నీ గమనించే స్థితిలో లేము. రైస్ కుక్కర్ లో అన్నం వండుకొని బయట నుంచి కూరలు తెచ్చుకొని తినే బ్రతుకులు అయ్యాయి.
అదే కట్టెల పొయ్యి మీద దొడ్డు బియ్యం అన్నం వండుతుంటే ఉడికినప్పుడు వచ్చే వాసన ఎంత బాగుంటుంది అనేది మనం మర్చిపోయాం.. చింతపండు తొక్కు వేసుకొని కంచం నిండా అన్నం పెట్టుకొని లేదా గోడ్డు కారమైన వేసుకొని తినే రోజులను మర్చిపోయాం.
ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పడి పునుగులు బజ్జీలు పిజ్జాలు బర్గర్లు అంటూ ఒళ్ళు పెంచుతూ మళ్లీ ఆ ఒళ్ళును తగ్గించుకోవడానికి జిమ్ముల వెంట పరుగు తీస్తునాము.
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పల్లెటూరికి వెళ్ళండి అక్కడ రైస్ మిల్లులో ఒక్కసారి ఆడించిన వడ్లను మించి వచ్చిన బియ్యాన్ని తీసుకొని అక్కడే దగ్గర్లో ఉల్లిపాయ కారప్పొడి చింతపండు లాంటివి దొరుకుతాయేమో వెతకండి. మీరే రైతు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ధర కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ రేటు పెట్టే బదులు రైతు దగ్గరికి వెళ్లి అతను ఎంత చెప్తే అంత ఇచ్చి తెచ్చుకోండి.
ఆ బియ్యంతో అన్నం వండుకొని ఉల్లిపాయతో పులుసు పెట్టుకొని తిని చూడండి. రుచి మీకే తెలుస్తుంది. జన్మలో దీన్ని మర్చిపోలేరు. నువ్వు తింటే మేము కూడా తినాలా అని అంటారేమో , మంచి ఎవరికైనా చేదే కదా అది మీ ఇష్టం ఇక ఉంటాను, నేను ఉల్లిగడ్డ పులుసు చేసుకోవడానికి వెళ్తున్నా , టా టా బై బై..
ఆ చారు తినే నువ్వు నీ పేరు పెట్టుకున్నావ్ ఏమో అని అంటారు కొందరు నాకు తెలుసు. మీరేమీ అనుకున్నా నాకు నష్టం లేదు అంతే కదా ఏమంటారు?
-భవ్యచారు
కధ చాలా బాగుంది.