కలలు-కన్నీళ్ళు
మనసుకు ఆహ్లాదం
కనులకు ఆమోదం తెలుపుతూ
సాగిపోయే జీవితంలో
ఎన్నో తలపులు,దృశ్యాలు
బాధ్యతల బరువును
మోసేందుకు
దూరంగా తరలిపోతుంటాం
బతుకును బాగుచేయాలని
కాలం ఒడిలో సేదతీరుతుంటాం
జ్ఞాపకాలన్నీ గుండెగుడిలో
భద్రంగా దాచుకుంటూ!
కలలు కన్నీళ్ళు జమిలిగా
తోడవుతాయి
ఇదే జీవితమంటూ ఊరడిస్తుంటాయి
-సి.యస్.రాంబాబు