కలలు కనే కళ్ళు

కలలు కనే కళ్ళు

మాటలతో చేతలతో చెప్పలేని
భావాలను కళ్ళు ప్రదర్శిస్తాయి 

కలలకు సాక్ష్యం కళ్ళే కదామరి!
గుండెలోని తీపి కలల గుర్తులు

వికసించేను ఆలోచనలకు
పదును పట్టినప్పుడు

కమ్మని కలలు వస్తూంటాయి
అందరికీ ముంగిట నిలుచును
కొందరికి నిజమై

అలసిన కనులకు ఇంపుగా
కరిగిపోయే కాలంలో కలసివచ్చే
పనులతో శక్తి వంచన లేకుండా ఆశించని ఫలితంతో

రేపటి రోజుకు అద్భుతం
మనసూ చెప్పే మౌన గీతం

ఊహల్లో తేలకుండా
ఆశల స్వప్నం అందుకుని

కన్నవారికలలునిజమవ్వాలంటే
కనులే దారులై వెతకాలి మరి
రంగులమయ జీవనంలోకలలు
పండిన రోజున కాంతులై
వెలుగుతుంది భవిష్యత్తు…….?

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *