కలలు..అలలు..
నిజం నిలకడగా ఉన్నట్లు
గాలి కూడా స్తబ్దుగా ఉంది
వైశాఖ సూరీడు
విసుగ్గా ఉన్నాడు
విరామచిహ్నాలు లేక జీవితం
ఎంత అలిసిపోయుండాలి
నిత్యం కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటుంది
మనసు బాలేదని మనమే అన్నింటా నిరాశ చూస్తుంటాం
మనసు కొలనులో ఆలోచనల అలలు
స్థంభిస్తే
అంతా నిస్తేజమే
అందుకే కలలు,అలలు ప్రవహించాల్సిందే
కత్తి చూసే కాలాన్ని నిలవరించాల్సిందే
-సి.యస్.రాంబాబు