కలగంటినోయి
కలగంటినోయి నేను
సమ సమాజ అభివృద్ధికై నిరంతరం శ్రమించాలని..
కలగంటినోయి నేను
నిత్యం మన కోసం పాటుపడే
రైతన్న కలల సాకారానికి సాయపడాలని..
కలగంటినోయి నేను
మద్యపాన నిషేధానికి అందరి
వంతు సాయం కావాలని..
కలగంటినోయి నేను..
మనుషుల్లో మానవత్వం మెరుగుకావాలని..
కలగంటి కలగంటినోయి నేను
ఆడకూతుళ్ళ కన్నీటిని చూడని
లోకాన్ని చూస్తానేమో అని..
కలగంటి కలగంటినోయి నేను
ఆకలి చావులను మన దేశంలో
అరికట్టాలని..
కలగంటి కలగంటినోయి నేను
మనిషిగా మనసును పెట్టి..
అందరితో కలిసిపోవాలని..
– గాయత్రీభాస్కర్