కలగంటి

కలగంటి

కనులారా నిదురలో
కలగంటిని ఆసక్తిగా

కవినై కలం కదపాలని
ఏఒక్కరైనా
మార్పుతేవాలని

సమాజంలో

అధర్మాన్ని అరికట్టాలని

అశాంతి దరిచేరవని

స్వేచ్చా స్వాతంత్ర్యాలు
భంగం కలగదని

అసమర్ధత రాజ్యమేలదని

అవినీతి అంత మొందుతుందని

నైతిక విలువలు
నిలువునా నిలుస్తాయని

నిరుద్యోగులు ఉండకూడదని

అసమానతలు
తొలగి పోవాలని

ఆకలి కేకలు వినపడవని

నిరక్షరాస్యులు
ఉండకూడదని

విజ్ఞానము కొనకూడదని

నిరాశలు కదిలిపోవాలని

నిరీక్షణ నెరవేరుతుందని

అదృష్టం వరిస్తుందని

కలలోనే చిగురాశ కలిగెనే

ఊహల కలగంటి

మెరుగుపడాలి కొంతైనా

మారని సమాజం మరి…?

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *